Tirupathi Rao
YS Jagan Mohan Reddy Comments: జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలు, సమన్వయకర్తలు, కన్వీనర్లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
YS Jagan Mohan Reddy Comments: జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలు, సమన్వయకర్తలు, కన్వీనర్లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Tirupathi Rao
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ వేడి రాజుకొంది. అధికార వైసీపీ 175కి 175 స్థానాలు క్లీన్ స్వీప్ చేయాలి అంటూ దూకుడుగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ కూడా వరుస సభలతో కార్యకర్తలు, నేతల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. తాజాగా మంగళగిరిలో “మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం” అంటూ విసృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు సహా నియోజకవర్గ, మండల, జగనన్న సచివాలయాల కన్వీనక్లు సైతం పాల్గొన్నారు. కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ లో వైస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు.
2024 ఎన్నికలకు మనం అందరం సిద్ధమయ్యాం. వచ్చే 45 రోజులు మనకు ఎంతో కీలకం. ఇప్పటికే గ్రౌండ్ లెవల్ నుంచి మనం బలంగా ఉన్నాం. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నేర్పరి. బంగారు రుణాలు, రైతు రుణమాఫీ అంటూ గతంలో చేసిన చెత్త ప్రకటనలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. సాధ్యాసాధ్యాలు తెలియకుండానే చంద్రబాబు అలాంటి వాగ్దానాలు చేశారు. మనం అలా చేయం. చెప్పేదే చేస్తాం.. చేసేదే చెప్తాం. రాజకీయాల్లో ఎంతో ముఖ్యమైనది విశ్వసనీయత. కానీ, చంద్రబాబుకు అది లేదు. విపక్షాలు చేసే దుష్ప్రాచారాలను తిప్పి కొట్టండి.
టీడీపీ వెబ్ సైట్ లో నుంచి మేనిఫెస్టో కూడా తీసేశారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాం. ఇప్పుడు నా కార్యకర్తలు అందరూ సగర్వంగా ప్రతి ఇంటికి వెళ్లి.. మేనిఫెస్టోని ఎలా చేసి చూపించామో చెప్పాలని కోరుకుంటున్నాను. టీడీపీ వాళ్లు మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో పడేసేదానిలా చూస్తారు. మనకి మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్. జగన్ చేస్తాను అని చెబితే చేస్తాడు. ఇదంతా నమ్మకానికి సంబంధించింది. జగన్ ఆచి తూ.చి.న తర్వాతే వాగ్దానాలు చేస్తారు. వైఎస్సార్ సీపీ ఒక్కటే దేశంలో విశ్వసనీయత కలిగిన పార్టీ. మన ద్వారా 87 శాతం కుటుంబాలు ప్రయోజనం పొందాయి. వాటిలో కుప్పంలో 93.29 శాతం కుటుంబాలు కూడా ఉన్నాయి.
ఈ ఎన్నికల్లో జరిగేది క్యాస్ట్ వార్ కాదు.. క్లాస్ వార్. పేదలు అందరూ ఒకవైపు.. పెత్తందారులు ఒకవైపు ఉంటారు. మీరందరూ ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీకి ఓటు వేయకపోతే ఇప్పుడు సంక్షేమం అంతా ఆగిపోతుందని అవగాహన కల్పించాలి. బూత్ స్థాయిలో ఓటర్లను కలవండి. ఎన్నికల్లోపు ఓటరును కనీసం ఐదారుసార్లు కలవండి. వాలంటీర్లు- గృహసారథులతో కలిసి సమన్వయపరుచుకోండి. ఒక సొంత బృందాన్ని తయారు చేసుకోండి. ఆ బృందంలో 18 మంది వరకు బూత్ సభ్యులు ఉండాలి. టికెట్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను ప్రకటించాం. ఇంక దాదాపుగా అవే ఫైనల్ లిస్ట్ అవుతుంది. మీరు చేయాల్సింది ప్రతి గడపకు వెళ్లి మనం ఇన్నాళ్లు చేసిన మంచిని వారికి తెలిసేలా చెప్పండి. మీరంతా పూర్తి విశ్వాసంతో ప్రతి గడపకు వెళ్లండి. పేదలకు మంచి చేశామని.. ఇప్పుడు వారి మద్ధతు మనకు అవసరం అనే విషయాన్ని తెలియజేయండి. మన టార్గెట్ 25కి 25 ఎంపీ స్థానాలు, 175కి 175 అసెంబ్లీ స్థానాలు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి.. ఆల్ ది బెస్ట్” అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.