Vinay Kola
Lady Aghori: లేడీ అఘోరీ మళ్ళీ రెచ్చిపోయింది. మంగలగిరీలో రచ్చ చేసింది.
Lady Aghori: లేడీ అఘోరీ మళ్ళీ రెచ్చిపోయింది. మంగలగిరీలో రచ్చ చేసింది.
Vinay Kola
అఘోరి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు సృష్టించడం ఏమాత్రం కూడా ఆపడం లేదు. అత్యాచారాలు, గోహత్యల నివారణకే నేనున్నా అని అందుకోసం ఎన్నో పూజలు చేశానని తెలిపింది. లోక కళ్యాణం, సనాతన ధర్మాన్ని కాపాడుతానని తెలిపింది. ఇంకా హిందూ దేవాలయాలు, మహిళలపై దాడి చేస్తున్న వారి మర్మాంగాన్ని కొయ్యబోతున్నానంటూ ఇటీవల హెచ్చరించింది. అదే సమయంలో అందరం కలిసికట్టుగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందామని కామెంట్స్ చేసింది. ఆడపిల్లలను కాపాడుకుందాం, గోహత్యలను ఆపుదాం అనే నినాదంతో రెండు తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తు రచ్చ రచ్చ చేస్తుంది. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తూ ఎక్కడ చూసినా కూడా హాల్ చల్ చేస్తుంది. సంచలనాలు సృష్టిస్తుంది.
ఇందులో భాగంగానే ఇక తాజాగా ఏపీలోని మంగళగిరిలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా రచ్చ చేసింది. తన చేష్టలతో హల్ చల్ చేసింది. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ జనసేన పార్టీ ఆఫీసు ముందు బైటాయించింది. పవన్ కళ్యాణ్‌ను కలిశాకే వెళ్తానంటూ రోడ్డుపైనే అడ్డంగా కూర్చుంది. ఎవరూ ఎంత సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా కూడా ఆమె అస్సలు వినలేదు. పోలీసులపైనా కూడా అఘోరి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా అంతేకాకుండా వారిపైనే దాడికి ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. డెప్యూటీ సిఎం కార్యాలయం ఎదుట రోడ్డుపై భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ఆమె రోడ్డుపై కూర్చోడం వలన ఏకంగా కిలోమీటరు దాకా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అటుగా ప్రయాణించే వారి రద్దీ ఎక్కువ అయింది. అఘోరీ మాత్రం డిప్యూటీ సిఎంని కలవకుండా వెళ్ళే ప్రసక్తే లేదని దిష్ట వేసి నడి రోడ్డు మధ్యనే కూర్చుంది.
ఇక ఆమె చేష్టలకు విసుగెత్తి పోయినా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను ఈడ్చు కెళ్ళి DCM లో పడేశారు. ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కించినా కానీ ఆమె తగ్గట్లేదు. దాంతో ఆమె ఒక్కసారిగా వాహనంలో నుంచి పోలీసులవైపుకి దూకి దాడి చేసే ప్రయత్నం చేసింది. అఘోరీ ప్రవర్తన చూసి ఆ రోడ్డుపైన ఆగిపోయిన ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎంతోమంది అఘోరాలు ఉన్నారు కానీ ఇలా వారు జనాలను ఇబ్బంది పెట్టె ప్రయత్నాలు చేయలేదని మీడియాకి చెప్పారు. ఈ అఘోరీ ఇలా జనాల మధ్యలోకి వచ్చి రచ్చ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని అన్నారు. ఇందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరి అఘోరీ అరెస్ట్ గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.