iDreamPost
android-app
ios-app

ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? వీటిని ఎలా నిర్వహిస్తారంటే?

లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నేటితో ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఈ క్రమంలో పోలింగ్ ఏజన్సీలు, న్యూస్ ఛానల్స్ ఎగ్జిట్ ఫలితాలను ప్రకటించాయి.

లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నేటితో ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఈ క్రమంలో పోలింగ్ ఏజన్సీలు, న్యూస్ ఛానల్స్ ఎగ్జిట్ ఫలితాలను ప్రకటించాయి.

ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? వీటిని ఎలా నిర్వహిస్తారంటే?

దేశంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ నేటితో ముగుస్తుంది. 7 దశల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు జూన్ 1తో ముగియనున్నాయి. ఇక వీటికి సంబంధించిన ఫలితాలు జూన్ 4 న విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్నది. అటు రాజకీయ నాయకుల్లో ఇటు ప్రజల్లోనూ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఎన్నికల పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత పలు పోలింగ్ ఏజన్సీలు, న్యూస్ ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ ను విడదల చేస్తుంటాయి. ఇక ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ మరికాసేపట్లో విడుదలకానున్నాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలల్లో ఏ పార్టీ అధికారం చేపట్టబోతుందనే విషయం తేలుతుంది. అయితే ఇది వాస్తవ ఫలితాలకు చాలా తేడా ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి.

ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి?

ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్న వేళ ప్రజలంతా ఉత్కంఠతగా ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి. అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది అని ఊపిరిబిగపట్టి చూస్తున్నారు. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? దేని ఆధారంగా ఎగ్జిట్ ఫలితాలను ప్రకటిస్తారు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని పోలింగ్ ఏజన్సీలు, న్యూస్ ఛానల్స్ ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు.. పోలింగ్ లో పాల్గొన్న ఓటర్లను సంప్రదిస్తారు. ఓటర్లు ఓటు వేసి పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే వారి నుంచి సమాచారాన్ని సేకరిస్తారు.

ఓటర్లను ఇంటర్వ్యూ చేసి ఎవరికీ ఓటు వేసారు.. ఎక్కడ నివసిస్తారు ఇంకా ఇతర ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకుని ఆ డేటా ఆధారంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటిస్తూ ఉంటాయి ఆయా సంస్థలు. పోలింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల దూరంలో ఉండి ఈ సర్వే చేస్తారు. ఓటర్లు ఇచ్చే సమాచారం ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేస్తారు. ఈ ప్రకారంగా వెలువరించే ముందస్తు ఎన్నికల ఫలితాలనే ఎగ్జిట్ పోల్స్ అంటారు. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎప్పటికీ సరైనవి కావు.

పలు పోలింగ్ కేంద్రాల్లో ఈ విధంగా సమాచారాన్ని సేకరించి పార్టీలకు వచ్చే సీట్లు ఎన్ని, పోలింగ్ శాతం ఎంత అనే విషయాలను అంచనా వేస్తారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల ఖచ్చితత్వం విషయానికి వస్తే.. తుది ఫలితాలకు 95 శాతం దగ్గరగా ఉంటేనే ఎగ్జిట్ పోల్ అంచానాల్లో ఖచ్చితత్వం ఉన్నట్లు భావించవచ్చని కానీ చాల సంస్థలు తుది ఫలితాలకు 60 శాతం దగ్గరగా ఉన్నా కూడా తమ అంచనాలే నిజమయ్యాయని చెప్పుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.