iDreamPost
android-app
ios-app

Kesineni Nani: లోకేష్‌పై కేశినేని నాని ఫైర్‌.. ‘MLAగా గెలవలెనోడివి నాపై నీ పెత్తనమేంటి?’

  • Published Jan 11, 2024 | 1:46 PM Updated Updated Jan 11, 2024 | 1:46 PM

విజయవాడ ఎంపీ కేశినేని నాని.. నారా లోకేష్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు.. నాపై పెత్తనం చేసేదేంటి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు.

విజయవాడ ఎంపీ కేశినేని నాని.. నారా లోకేష్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు.. నాపై పెత్తనం చేసేదేంటి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు.

  • Published Jan 11, 2024 | 1:46 PMUpdated Jan 11, 2024 | 1:46 PM
Kesineni Nani: లోకేష్‌పై కేశినేని నాని ఫైర్‌.. ‘MLAగా గెలవలెనోడివి నాపై నీ పెత్తనమేంటి?’

టీడీపీకి రాజీనామా చేసిన ఆంధ్రప్రదేశ్‌ విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుని.. పార్టీలో జాయిన్‌ అయ్యారు నాని. అనంతరం జగన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు కొడుకుగా తప్ప లోకేష్‌కు ఉన్న అర్హత ఏంటని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన తనపై.. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్‌ పెత్తనం చేయడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ.. లోకేష్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ హక్కు ఉందని లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించాడని ఈ సందర్భంగా కేశినేని నాని ప్రశ్నించారు. చంద్రబాబు కొడుకుగా తప్ప లోకేష్‌కు ఉన్న అర్హత ఏంటని అడిగారు. ఆఫ్ట్రాల్ ఓడిపోయిన ఎమ్మెల్యే అంటూ లోకేష్‌ని ఎద్దేవా చేశారు. అంతేకాక పార్టీ ఇచ్చిన అన్ని వనరులను వినియోగించుకున్నా కూడ లోకేష్ మంగళగిరిలో ఓటమి పాలయ్యాడన్నారు. కానీ, పార్టీ నుండి ఏం ఆశించకుండానే తాను రెండు సార్లు విజయవాడ పార్లమెంట్ స్థానంలో విజయం సాధించినట్టుగా చెప్పుకొచ్చారు

ఆఫ్ట్రాల్ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్ధి అయిన లోకేష్ చేసే పాదయాత్రకు తాను ఎందుకు హాజరు కావాలని కేశినేని నాని ప్రశ్నించారు. పార్టీ సీనియర్లకు లోకేష్ ఇచ్చే విలువ ఇదేనా అన్నారు. కుటుంబంలో చిచ్చుపెట్టి కుటుంబ సభ్యులతోనే తనపై దాడి చేయించే ప్రయత్నం చేశారని కేశినేని నాని ఆరోపణలు చేశారు. తన కుటుంబ సభ్యులతోనే తనపై లోకేష్ దాడి చేయించారని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. నాని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ గా మారాయి.

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ నెల 4వ తేదీన తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన రాజీనామా విషయాన్ని తెలిపారు. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి కేశినేని నాని తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించారు. 2019లో ఎన్నికల తర్వాత కేశినేని నానికి పార్టీ నాయకత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. చివరకు ఆయన టీడీపీకి రాజీనామా చేసే వరకు విబేధాలు పెరిగాయి. మరి నాని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.