Dharani
తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఫైనల్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోయే స్థానాలపై స్పష్టత వచ్చింది. ఆ వివరాలు..
తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఫైనల్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోయే స్థానాలపై స్పష్టత వచ్చింది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో ఎన్నికల సమరంలో మొదలయ్యింది. పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. ఇక ఎన్నికల సమరంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ ఫుల్ స్పీడ్‌గా దూసుకుపోతుండగా.. బీజేపీ మాత్రం కాస్త స్లోగానే ఉంది. అభ్యర్థుల ప్రకటన, పొత్తుల అంశం ఇప్పుడే ఓ కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయని తెలుస్తోంది. ఫైనల్‌గా జనసేన పోటీ చేయబోయే స్థానాలు ఏవో తెలిసింది. మొదట జనసేన 11 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించినా.. తాజా చర్చల్లో 9 స్థానాలకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. కూకట్‌పల్లితోపాటు మరో ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
కిషన్‌రెడ్డితో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని ముందుగా భావించాము. దీనిపై బీజేపీతో చర్చించాము. తాజా భేటీలో జనసేన పోటీ చేయబోయే సీట్లకు సంబంధించి తుది నిర్ణయం జరిగింది. ఈ నెల 7న హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో మోడీ పాల్గొంటున్నారు. ఈ సభకు నేను కూడా హాజరవుతున్నాను’’ అని తెలిపారు.
జనసేనతో సీట్ల సర్దుబాటు చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని.. రెండు సీట్ల అంశంపై చర్చించాల్సి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని.. ఈ సభకు పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించామని చెప్పారు.
ఇక బీజేపీ ఇప్పటికే మూడు విడతల్లో 88 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో 31 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. త్వరలో ప్రకటించనున్న నాలుగో జాబితాలో జనసేనకు కేటాయించిన సీట్లతో పాటు బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న మిగిలిన అభ్యర్ధుల పేర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది.