Dharani
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ టీడీపీ, జనసేన కూటమిలో కదలిక మొదలైంది.. అది కూడా సీఎం జగన్ వల్ల. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ టీడీపీ, జనసేన కూటమిలో కదలిక మొదలైంది.. అది కూడా సీఎం జగన్ వల్ల. ఆ వివరాలు..
Dharani
ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతోంది. నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలను నియమించడంతో పాటు సిద్ధం సభలు నిర్వహిస్తూ.. విపక్ష కూటమిలో గుబులు పుట్టిస్తున్నారు సీఎం జగన్. ఇటు చూస్తే.. అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుండగా.. అటు చూస్తే.. కూటమిలో ఇంకా సీట్ల కేటాయింపు వ్యవహారమే ఓ కొలిక్కి రాలేదు. అసలు చాలా చోట్ల టీడీపీ, జనసేన నేతలు పొత్తును ఇంకా అంగీకరించడం లేదు. జనసేన నేతలకు టికెట్ ఇస్తే.. కచ్చితంగా ఓడిస్తామంటూ టీడీపీ కార్యకర్తలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు అంటే.. ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదలా ఉంచితే.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మార్చిలో కచ్చితంగా నోటిఫికేషన్ విడుదలవుతుంది అంటున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే.. టీడీపీ, జనసేన నేతలకు మాత్రం టికెట్ మీద ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అసలు ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థికి టికెట్ కేటాయిస్తారో అర్థం కాక పిచ్చెక్కి పోయి ఉన్నారు. ఇటు చూస్తేనేమో జగన్ ఎన్నికలకు సిద్ధం అంటూ.. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. కూటమి నాన్చుడు ధోరణిపై టీడీపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు గురించి ప్రకటించి నెలలు గడుస్తున్నా.. ఇంకా సీట్ల కేటాయింపు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. జగన్‌తో పోల్చి విమర్శలు చేస్తున్నారు.
ఆ దెబ్బకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగి వచ్చారు. అభ్యర్థుల ప్రకటనకు రెడీ అయ్యారు. బీజేపీతో పొత్తుపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. కానీ నేతల నుంచి ఒత్తిడి పెరగడంతో.. శనివారం అనగా ఫిబ్రవరి 24న ఉదయం తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు రెడీ అయ్యారు పవన్, చంద్రబాబు. ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కానీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు పార్టీల్లో జోష్ నింపడానికి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే జగన్ దూకుడుగా ఉన్నారు కనుకే.. వీరిలో ఇప్పటికైనా కదలిక వచ్చింది.. లేదంటే మరికొన్ని రోజులు ఇలానే నాన్చుడు ధోరణిలోనే ఉండేవారు అంటున్నారు కూటమి నేతలు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.