iDreamPost
android-app
ios-app

పవన్ కల్యాణ్- పూనమ్ గొడవల్లో నేను మీడియేటర్ అనుకున్నారు: రాజు రవితేజ

పవన్ కల్యాణ్- పూనమ్ గొడవల్లో నేను మీడియేటర్ అనుకున్నారు: రాజు రవితేజ

రాజు రవితేజ.. ఈయన పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలకు మాత్రం బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే రాజు రవితేజ పవన్ కల్యాణ్ 12 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణం చేయడం మాత్రమే కాకుండా.. జనసేన పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఆ తర్వాత పవన్ కల్యాణ్– రాజు రవితేజ మధ్య విభేదాలు తలెత్తడంతో పార్టీ నుంచి బయటకు వచ్చారు. పవన్ కల్యాణ్ ను ఎన్నో సంవత్సరాలు ఎంతో దగ్గరగా చూసిన రాజు రవితేజ తాజాగా ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజకీయ భవిష్యత్ మొదలు పూనమ్ కౌర్ తో ఉన్న విభేదాల వరకు అన్ని విషయాలను వెల్లడించారు.

రాజు రవితేజ ముఖ్యంగా పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కు అహం ఎక్కువని వ్యాఖ్యానించారు. ఆయన ఎవరు చెప్పినా వినరని.. చెప్పింది ఏదీ చేయరంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మూడో స్థానంలో ఉంటుంది అన్నారు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గనుక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే.. పవన్ ప్లేస్ నాలుగో స్థానానికి పడి పోతుందని జోస్యం చెప్పారు. పవన్ కల్యాణ్ ఎవరినీ స్వయంగా పిలవరని.. వేరొకరితో కబురు పెట్టిస్తారంటూ చెప్పారు. మళ్లీ జనసేనలోకి వెళ్తారా? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పారు. తాను మళ్లీ జనసేనలోకి వెళ్లే ప్రసక్తే లేదు అంటూ వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా రాజు రవితేజ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్- పూనమ్ కౌర్ మధ్య జరిగిన గొడవ ఎపిసోడ్ గురించి వ్యాఖ్యానించారు. ఇప్పుడే కాదు.. ఎప్పటి నుంచో వారి మధ్య వివాదాలు ఉన్నాయంటూ చాలానే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇటీవల పూనమ్ కౌర్ చేసిన ఒక ఇన్ డైరెక్ట్ రాజకీయ ట్వీట్ కూడా పవన్ కల్యాణ్ ఉద్దేశించే అంటూ కామెంట్స్ చేశారు. అయితే వారి మధ్య ఏం జరిగింది అనే దానిపై అటు అభిమానులకు కూడా క్లారిటీ లేదు. వాళ్లు సన్నిహితులా? శత్రువులా? అనే సందిగ్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ఎపిసోడ్ పై రాజు రవితేజ కామెంట్స్ తో కాస్త క్లారిటీ వచ్చినట్లు అయింది.

“పవన్ కల్యాణ్- పూనమ్ కౌర్ గొడవల మధ్యలో నేను మీడియేటర్ గా ఉన్నాను అనుకునేవారు. నిజానికి వారి మధ్యలో నేను లేను. వారి విషయంలోకి నేను అసలు ఎంటర్ కాలేదు. ఒకసారి మాత్రం ఆ గొడవ గురించి పవన్ కల్యాణ్ తో చర్చించాను. అసలు జరిగిన విషయం ఏంటనేది ఆయన చెప్పారు. కానీ, అది ఆయన వ్యక్తిగత విషయం కాబట్టి నేను ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు. నాకైతే పూనమ్ కౌర్ తో వ్యక్తిగతంగా ఎలాంటి పరిచయం లేదు. నేను ఆమెతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు” అంటూ రాజు రవితేజ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం రాజు రవితేజ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet