చంద్రబాబు ఆ హీరోయిన్ జీవితాన్ని నాశనం చేశాడు: పోసాని కృష్ణమురళి

Posani Krishna Murali: ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని.. చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ హీరోయిన్ జీవితాన్ని ఆయన నాశనం చేశాడని ఆరోపించారు.

Posani Krishna Murali: ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని.. చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ హీరోయిన్ జీవితాన్ని ఆయన నాశనం చేశాడని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అధికార పార్టీ, విపక్ష కూటమి ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నాయి. ఒకరిపై ఒకరిపై రాజకీయ, వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ.. రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేస్తోన్న బస్సు యాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. లక్షల్లో జనాలు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడిపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ హీరోయిన్ జీవితాన్ని ఆయన నాశనం చేశారని చెప్పుకొచ్చారు. ఆ వివరాలు..

పోసాని కృష్ణమురళి బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ’’చంద్రబాబు వ్యవస్థలన్నింటిని భ్రష్టుపట్టించారు. నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పింఛన్లు అందకుండ అడ్డుకున్నారు. వాలంటీర్ల వ్యవస్థను చూసి టీడీపీ అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. గతంలో వారిని గోనె సంచుల మోసుకునే ఉద్యోగులు అంటూ ఎద్దెవా చేసిన బాబు.. ఇప్పుడు వారికి నెలకు 10 వేల జీతం ఇస్తానంటూ వారి కాళ్లు పట్టుకుంటున్నారు‘‘ అంటూ విమర్శించారు.

మగవాళ్లు లేనప్పుడు వాలంటీర్లు ఇండ్ల తలుపులు కొట్టేవారని.. ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేవారంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేశారంటూ పోసాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాలంటీర్లు నీ కొడుకు నారా లోకేశ్‌లా తాగుబోతులు, తిరుగుబోతులు కాదని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు వాలంటీర్లను విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు వారిపై కపట ప్రేమ చూపిస్తున్నారని.. వారి కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ పోసాని మండి పడ్డారు.

అంతేకాక చంద్రబాబు వల్ల ఓ హీరయిన్ జీవితం నాశనం అయ్యిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని. ఎన్టీఆర్ హయంలో ఓ వెలుగు వెలిగిన సదరు హీరోయిన్ జీవితాన్ని చంద్రబాబు నాశనం చేశారని పోసాని ఆరోపించారు. జయప్రద లాంటి పెద్ద హీరోయిన్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన చంద్రబాబు.. ఆమె జీవితాన్ని నాశనం చేశాడని ..ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీపార్వతిని బజారుకు ఈడ్చాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశఆరు. అంతేకాక పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ మీద కూడా విమర్శలు చేశారు పోసాని.

Show comments