iDreamPost
android-app
ios-app

కుటుంబం లేదని విమర్శిస్తున్నారు! ప్రధాని మోదీ ఎమోషనల్‌ కామెంట్స్‌

  • Published Mar 05, 2024 | 1:23 PM Updated Updated Mar 05, 2024 | 1:28 PM

PM Narendra Modi: తెలంగాణలోని సంగారెడ్డిలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. కుటుంబం విషయంలో ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

PM Narendra Modi: తెలంగాణలోని సంగారెడ్డిలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. కుటుంబం విషయంలో ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 05, 2024 | 1:23 PMUpdated Mar 05, 2024 | 1:28 PM
కుటుంబం లేదని విమర్శిస్తున్నారు! ప్రధాని మోదీ ఎమోషనల్‌ కామెంట్స్‌

తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. బీజేపీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన ప్రధాని మోదీ.. తొలి సారి కుటుంబం విషయంలో భావోద్వేగానికి గురయ్యారు. చాలా మంది తనకు కుటుంబం లేదని విమర్శలు చేస్తుంటారని.. 140 కోట్ల మంది భారతీయులంతా నా కుటుంబమే అంటూ మోదీ ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు. కొన్ని రోజులుగా.. ‘హమ్‌ హై మోదీ పరివార్‌’ ‘నేను మోదీ కుంటుంబం’ అంటూ ట్విట్టర్‌లో హ్యాష్‌ ట్యాగ్‌లు కూడా ట్రెండ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ.. మోదీ ఈ విధంగా స్పందించారు. భారతీయులంతా తన కుటుంబమే అన్నారు.

అలాగే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అలాగే, గత ప్రభుత్వం బీఆర్‌ఎస్‌పై కూడా ప్రధాని విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు ఒక గూటీ పక్షులే అన్నారు. అలాగే మోదీ గ్యారెంటీలు చేసి చూపిస్తున్నాం అని.. ఆర్టికల్‌ 370 రద్దు చేస్తామని చెప్పాం, చేసి చూపించాం. రామ మందిరం కడతామని చెప్పాం, కట్టి చూపించాం అని పేర్కొన్నారు. తానేప్పుడు వ్యక్తిగత విమర్శలకు దిగలేదని, కేవలం కుటుంబ రాజకీయాలపై మాట్లాడానని అన్నారు. మోదీ గ్యారెంటీల్లో భాగంగా.. మరో గ్యారెంటీ ఇస్తున్నానని, రాబోయే కొన్ని ఏళ్లలోనే భారత్‌ను మూడో అతి పెద్ద ఎకానమీ చేస్తామని హామీ ఇచ్చారు. చాలా మంది మోదీకి కుటుంబం లేదని అంటున్నారు. కుటుంబ పార్టీలకు దోపిడీ చేసుకోవడానికి లైసెన్స్‌ ఉందా? అని ప్రశ్నించారు.

కొన్ని పార్టీలు తమ కుటుంబం ముందు అంటారు. కానీ, తాను మాత్రం దేశం ముందు అంటానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తమిళనాడు నుంచి కశ్మీర్‌ వరకు కుటుంబ పార్టీలు బలపడ్డాయి కానీ, రాష్ట్రాలు మాత్రం నాశనం అయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్‌లో కుటుంబ పాలన వచ్చిన తర్వాత.. యువకులను రాజకీయాల్లో పైకి రానివ్వడం లేదని, కుటుంబం నుంచి కాకుండా వేరే వ్యక్తులను పార్టీల్లో పెద్ద పదవుల్లో ఉండాలంటే వయసు మళ్లిన వాళ్లను తీసుకొస్తారని ఎద్దేవా చేశారు. తనకు వచ్చిన అన్ని రకాల బహుమతులు కూడా దేశం కోసమే ఇచ్చానని, వాటిని వేలం వేసి.. వచ్చిన డబ్బును గంగా నదీ ప్రక్షాళనకు ఉపయోగిస్తున్నాం అంటూ ప్రధాని వెల్లడించారు. మరి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.