పవన్ మళ్లీ గాజువాక కోరుతున్నాడా? TDP షాకింగ్ రియాక్షన్?

ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక అసెంబ్లీ నుంచి పోటీచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలస్తోంది. ఈ కారణంగానే మళ్లీ గాజువాక సీటును తనకు కేటాయించాలని టీడీపీని కోరుతున్నట్లు సమాచారం.

ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక అసెంబ్లీ నుంచి పోటీచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలస్తోంది. ఈ కారణంగానే మళ్లీ గాజువాక సీటును తనకు కేటాయించాలని టీడీపీని కోరుతున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే అధికార వైసీపీ మాత్రం ఖచ్చితమైన వ్యూహాలతో అడుగులు వేస్తూ 175 స్థానాల్లో గెలుపొందుతామనే కాన్ఫిడెన్స్ తో ఉంది. ఇక టీడీపీ, జనసేనలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. జనసేన, టీడీపీలు సీట్ల పంపకాల విషయమై ఇప్పటికే చర్చలు కూడా జరిపాయి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వాలని టీడీపీని అడుగుతున్నారు. ఈ సీటు జనసేనకు కేటాయించడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయన్న టాక్ వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీకి ఇప్పటి వరకు క్యాడర్ లేదు.. నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన పవన్ ఆ గుణపాఠాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. కాగా ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు పవన్. దీనిలో భాగంగానే తనకు గాజువాక సీటు ఇవ్వాలని టీడీపీని కోరుతున్నట్లు సమాచారం. 2019లో ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలో 16,753 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. అదే సమయంలో పవన్ భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 8,357 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ కారణంతో తను పోటీ చేసే నియోజక వర్గాలను మారుస్తారని భావించారు. కానీ మళ్లీ గాజువాక నుంచే పోటీ చేస్తానని ఆ సీటును తనకు కేటాయించాలని టీడీపీని కోరుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాక పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు.

అయితే టీడీపీ శ్రేణులు ఈసారి సీటును గెలిపించుకుంటారనే నమ్మకంతో పవన్ కళ్యాణ్ మరోసారి గాజువాకను అడుగుతున్నట్లు సమాచారం. అయితే గాజువాక సీటును జనసేనకు ఇవ్వడంపై ఆ పార్టీ అగ్రనాయకత్వంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారని వినిపిస్తోది. కూటమిలో సీటు కావాలని టీడీపీ నేతలు కోరుతుండగా, జనసేనకు సీటు ఇవ్వడంపై శ్రేణుల నుంచి తీవ్ర ప్రతిఘటన వ్యక్తమవుతోందని తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్‌కు సీటు ఆఫర్ చేశారని, ఆ హామీ మేరకే జనసేన అధినేత యువ గళం ముగింపు బహిరంగ సభకు హాజరయ్యారని ఆ వర్గాలు తెలిపాయి.

గాజువాక నుంచి ఈసారి ఎలాగైన గెలుస్తానన్న నమ్మకంతో పవన్ టీడీపీని ఆ సీటు కేటాయించాలని కోరుతున్నారని సమాచారం. ఇక మరో స్థానంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయన మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని 2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 14,992 ఓట్ల తేడాతో గెలుపొందింది. టీడీపీతో పొత్తు పెట్టుకుని కూడా ఈ సీటును గెలవడం పవన్ కళ్యాణ్ కు అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ కాపు ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ స్థానిక రాజకీయాల కారణంగా టీడీపీ తన ఓటు బ్యాంకును జనసేనకు బదిలీ చేయకపోవచ్చు అనేది టాక్. ఈ కారణాలతో టీడీపీ గాజువాక సీటును పవన్ కు కేటాయించకపోతే ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Show comments