పెద్ద నేతలే కాదు.. కమీడియన్లు కూడా పార్టీలో ఉండే పరిస్థితి లేదు!

Pawan Kalyan Janasena Party: పవన్ కల్యాణ్ రాజకీయం రాష్ట్ర ప్రజల సంగతి తర్వాత.. సొంత పార్టీనే హర్షించే విధంగా లేదు.

Pawan Kalyan Janasena Party: పవన్ కల్యాణ్ రాజకీయం రాష్ట్ర ప్రజల సంగతి తర్వాత.. సొంత పార్టీనే హర్షించే విధంగా లేదు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారుతున్నాయి. ఈసారి కూడా వార్ వన్ సైడ్ అని దాదాపుగా అర్థమవుతోంది అంటూ రాజకీయ విశ్లేషకులు ఎప్పటి నుంచో అభిప్రాయ పడుతున్నారు. అందుకు సీఎం జగన్ దూకుడు, ప్రజా పక్షపాత రాజకీయ విధానమే కారణమని చెబుతున్నారు. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధమంటూ ఎన్నికల శంఖారావం పూరించారు. పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యుడిని కాదని.. అర్జునుడిని అంటూ మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మరోవైపు టీడీపీ- జనసేన కూటమి రాజకీయం మాత్రం ప్రజల సంగతి తర్వాత సొంత పార్టీ నేతలకే అర్థమయ్యే పరిస్థితి ఉండట్లేదు. ముఖ్యంగా జనసేన సంగతి అయితే మరీ అగమ్య గోచరంగా మారుతోంది. అందుకు తాజాగా జరిగిన పరిణామమే ప్రత్యక్ష ఉదాహరణ.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం సంగతులు పక్కన పెట్టి.. కేవలం సీఎం జగన్ ని ఓడించమే లక్ష్యంగా టీడీపీ- జనసేన కూటమి పొత్తు రాజకీయాలకు తెర లేపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో వారి రాజకీయాన్ని రాష్ట్ర ప్రజలు కూడా హర్షించే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర ప్రజల సంగతి పక్కన పెడితే సొంత పార్టీ నేతలు కూడా వారి కుటిల రాజకీయాన్ని సమర్థించే పరిస్థితులు కనిపించడం లేదు. టీడీపీలో అయితే ఇప్పటికే సీనియర్ నేతలు, పార్టీ స్థాపించినప్పటి నుంచి తోడున్న నాయకులు పార్టీలో ఉండలేమంటూ బాహటంగానే వ్యాఖ్యలు చేసి పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

పవన్ పార్టీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. జనసేన పార్టీ నుంచి కూడా నేతలు అలాగే వలస వెళ్లిపోతున్నారు. అయితే సీనియర్ నాయకులు మాత్రమే కాకండా.. ఇప్పుడు చోటా మోటా నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీలో కొనసాగి పరిస్థితులు లేవనే విషయం తేటతెల్లమవుతోంది. బుల్లితెర కమీడియన్ రింగ్ రియాజ్ పార్టీని విడటమే అందుకు ఉదాహరణగా చెప్పచ్చు. అతను వైసీపీలో చేరుతూ చాలా స్పష్టంగా చెప్పాడు. ఎక్కడ అభివృద్ధి ఉంటుందో.. అక్కడే ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. రాష్ట్ర ప్రజలు, రాజకీయ విశ్లేషకులకు మాత్రమే కాకుండా.. టీడీపీ, జనసేన పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తలకు కూడా జగన్ చేస్తున్న అభివృద్ధి కనిపిస్తోంది. కానీ, టీడీపీ కూటమి మాత్రం జగన్ ను ఓడించాలంటూ పగటి కలలు కంటున్నారు అంటూ రాష్ట్ర ప్రజలు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రజలు జగన్ పక్షాన ఉన్నారు అనడానికి భీమిలీ వేదికగా జరిగిన వైసీపీ సిద్ధం కార్యక్రమే సాక్ష్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జగన్ ఓవైపు దూకుడుగా రాజకీయం చేస్తూ పోతుంటే.. టీడీపీ కూటమి మాత్రం ఇప్పటికీ సీట్లు సర్దుబాటు చేసుకోలేని పరిస్థితిలో కొట్టు మిట్టాడుతోందని ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్రంలో గెలవడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం సంగతి తర్వాత.. ముందు సొంత పార్టీల్లోని నేతలు, కార్యకర్తలు తలదించుకోకుండా రాజకీయం చేయాలంటూ సూచిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కు ఇప్పటికైనా నీ రాజకీయం నీకు అర్థమవుతోందా పవన్ అంటూ ప్రశ్నిస్తున్నారు. అటు కాపు నేతలు కూడా పవన్ కల్యాణ్ ని పదే పదే ప్రశ్నిస్తున్నారు. పొత్తు పేరుతో పార్టీని తాకట్టు పెట్టద్దంటూ సూచిస్తున్నారు. మరి.. పెద్ద పెద్ద నేతల నుంచి కమీడియన్లు, కార్యకర్తల వరకు జనసేన పార్టీని వీడుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments