iDreamPost
android-app
ios-app

2004 నుంచి దోచేస్తున్నారా.. మరీ అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు పవన్‌?

  • Published Aug 19, 2023 | 12:03 PM Updated Updated Aug 19, 2023 | 12:03 PM
  • Published Aug 19, 2023 | 12:03 PMUpdated Aug 19, 2023 | 12:03 PM
2004 నుంచి దోచేస్తున్నారా.. మరీ అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు పవన్‌?

విశాఖలో వారాహి యాత్ర ముగింపు సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. 2004 నుంచి ఉత్తరాంధ్రను కాంగ్రెస్‌, వైసీపీ ప్రభుత్వాలు దోచుకున్నాయి అని.. తాము అధికారంలోకి వచ్చాక… ఎవరిని వదిలి పెట్టము అంటున్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు చూసిన జనాలు.. మధ్యలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉంది కదా పవన్‌ కళ్యాణ్‌.. మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు.. అప్పుడెందుకు చర్యలు తీసుకోలేదు అంటున్నారు జనాలు.

పవన్‌ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. 2004 నుంచి ఉత్తరాంధ్రాను నాటి కాంగ్రెస్ నేడు వైసీపీలో ఉన్న నేతలు అంతా దోచేశారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. భవిష్యత్తులో వచ్చేది తమ ప్రభుత్వమే అని.. తాము అధికారంలోకి వచ్చాక వాటి మీద విచారణ ఉంటుందని అన్నారు. అయితే ఇక్కడ పవన్‌ ఒక లాజిక్‌ మిస్‌ అయ్యారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మధ్యలో ఐదేళ్లు అంటే 2014 నుంచి 2019 వరకు పవన్‌ కళ్యాణ్‌ మద్దతిచ్చిన టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.

ముఖ్యంగా 2014 నుంచి 2019 దాకా విశాఖ సహా ఉత్తరాంధ్రాలో జరిగిన భూ దందాల విషయంలో పలువురు టీడీపీ నేతల పేర్లు వినిపించాయి. టీడీపీకి చెందిన ఒక మాజీ మంత్రి టీడీపీ ప్రభుత్వం అప్పట్లో వేసిన సిట్‌ దీని మీద ఫిర్యాదు చేశారు కూడా. మరి పవన్‌ కళ్యాణ్‌ ఈ విషయాల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పే అవుతుంది కదా.. మరి టీడీపీ నేతల అక్రమాల గురించి కూడా ప్రశ్నిస్తే బాగుటుంది కదా. మీరు మద్దతిస్తున్నారని.. టీడీపీ హయాంలో జరిగినవి అక్రమాలు కాకుండా పోతాయా అంటున్నారు జనాలు. ఎర్రమట్టి దిబ్బల గురించి కూడా ఇలానే తప్పుడు ఆరోపణలు చేశావు.. ఆఖరికి ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు జనాలు. నిజంగా పవన్‌కు ఉత్తరాంధ్ర మీద చిత్తశుద్ధి ఉంటే టీడీపీని కూడా విమర్శించేవారు అని చర్చించుకుంటున్నారు జనాలు.