iDreamPost
android-app
ios-app

CM జగన్‌ పథకాలు అద్భుతమని అంగీకరించిన పవన్‌.. అందుకేనా ఈ భయం!

  • Published Aug 16, 2023 | 2:03 PMUpdated Aug 16, 2023 | 2:03 PM
  • Published Aug 16, 2023 | 2:03 PMUpdated Aug 16, 2023 | 2:03 PM
CM జగన్‌ పథకాలు అద్భుతమని అంగీకరించిన పవన్‌.. అందుకేనా ఈ భయం!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మహా అయితే మరో 8 నెలల సమయం ఉంటుందేమో. గతంతో పోలిస్తే.. రానున్న ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారనుంది. ముఖ్యమంత్రి జగన్‌ ఒకరు ఒక వైపు.. మిగతా పార్టీలన్ని ఒకవైపుగా పోటీ సాగనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్‌ ఒక్కడిని ఓడించడం కోసం మిగతా పార్టీలన్ని ఏకం కాబోతున్నాయి. అయితే ఎన్ని పార్టీలు కలిసినా.. ఎందరు ఏకమైనా జగన్‌ని ఇంచు కూడా కదిలించలేరన్నది వాస్తవం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి.. ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీల అమలుకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు సీఎం జగన్‌. లబ్దిదారులందరికి ఎలాంటి వివక్ష చూపకుండా పథకాలను అందించడం కోసం ఏకంగా వాలటీర్‌ లాంటి వ్యవస్థనే తీసుకువచ్చి.. ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలను చేర్చి.. సరికొత్త రికార్డు సృష్టించారు సీఎం జగన్‌.

రాష్ట్రంలోని ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను చేర్చారు సీఎం జగన్‌. అదే ఆయనను ప్రజల గుండెల్లో దేవుడిని చేసింది. జగన్‌ పట్ల ప్రజల్లో నెలకొన్ని ఈ అభిమానమే ప్రతిపక్షాలకు కంఠగింపుగా మారింది. జగన్‌ పాలన గురించి ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా ఫలితం లేదు.. ఉండదు అని వారికి కూడా అర్థం అయ్యింది. పవన్‌ కళ్యాణ్‌ వంటి నేతలకైతే.. జగన్‌పై ప్రజలకున్న అభిమానం చూస్తే.. పిచ్చెక్కుతుంది. తాము ఏం చేసినా.. దాన్ని తగ్గించలేమని అర్థం అయ్యింది. అందుకే వాలంటీర్‌ వ్యవస్థ మీద విమర్శలు చేసి.. తమ కడుపులో ఉన్న విషాన్ని వెళ్లగక్కారు. అయితే ప్రజలు ఎదురు తిరగడంతో.. తోక ముడవక తప్పలేదు.

ఈ క్రమంలో సడెన్‌గా పవన్‌ వైఖరిలో మార్పు వచ్చింది. ఆయనకు తెలియకుండానే జగన్‌ పాలన, సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని భయపడవద్దు. ఇంతకంటే అద్భుతమైన పథకాలు వస్తాయి.. తప్ప ఏ పథకం ఆగిపోదు అంటూ.. పవన్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారియి. జగన్‌ సర్కార్‌ అమలు చేస్తోన్న పథకాలు చాలా గొప్పవని.. జగన్‌ పాలన అంటే సంక్షేమానికి అధిక ప్రాధాన్యత అని పవన్‌ కూడా పరోక్షంగా అంగీకరించినట్లు అయ్యింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్‌పై ప్రజలుకున్న నమ్మకమే పవన్‌ను భయపెడుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి