MLC Kavitha: గచ్చిబౌలి AIG ఆస్పత్రికి కవిత.. సాయంత్రం వరకు వైద్య పరీక్షలు !

MLC Kavitha Admited In AIG Hospital: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్పత్రిలో చేరారు. ఆవిడ పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారు.

MLC Kavitha Admited In AIG Hospital: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్పత్రిలో చేరారు. ఆవిడ పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. తిహార్ జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఎవరికీ కనిపించలేదు. కనీసం రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. కానీ, తాజాగా ఆవిడ బయటకు వచ్చారు. అయితే ఏదో కార్యక్రమంలో పాల్గొనడాని రాలేదు. ఆస్పత్రిలో చేరేందుకు ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చారు. గచ్చిబౌలి AIG ఆస్పత్రిలో కవిత చేరారు. ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కవిత మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఆమెకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం వరకు కవిత ఆస్పత్రిలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అన్నీ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె తిరిగి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కి వెళ్లనున్నారు. అయితే ఆమె ఏ ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది? అనే పూర్తి వివరాలు చూద్దాం.

కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి కవిత దాదాపు 5 నెలలపాటు తీహార్ జైలులో ఉన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ఆవిడ తిరిగి హైదరాబాద్ కు వచ్చారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి తండ్రికి పాదాభివందనం చేసి కవిత వెళ్లిపోయారు. మళ్లీ తిరిగి ఆమెను ఎక్కడా బయట చూడలేదు. మళ్లీ మంగళవారం రోజు బయటకు వచ్చారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. తీహార్ జైలులో ఉన్న సమయంలోనే కవిత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడ్డారు. జైలులో ఉన్న సమయంలో తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడ్డారు. అలాగే గైనిక్ సమస్యలు కూడా తీవ్రమయ్యాయి.

తీహార్ జైలులో ఉన్న సమయంలో ఢిల్లీ ఎయిమ్స్ లో కవితకు వైద్యం అందించారు. ఇప్పుడు మళ్లీ ఆ సమస్యలు ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం వరకు కవిత ఆస్పత్రిలోనే ఉండనున్నారు. పూర్తి పరీక్షలు నిర్వహించిన అనంతరం రిపోర్టులను ఈడీ, కోర్టుకు కూడా సమర్పించే అవకాశం ఉంది. అలాగే పరీక్షలు పూర్తైన తర్వాత తిరిగి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కి కవిత వెళ్లిపోతారని తెలుస్తోంది. కవితకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విజువల్స్ చూస్తే కవిత ఎంతో నీరసంగా కనిపిస్తున్నారు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఈ అనారోగ్య సమస్యల నేపథ్యంలోనే ఈ ఏడాది కవిత బతుకమ్మ సంబరాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉండదు అంటున్నారు. నిజానికి ముందు నుంచే ఈ వార్తలు వైరల్ అయ్యాయి. ఇవాళ ఆస్పత్రిలో కవిత దృశ్యాలు చూసిన ఆవిడ సంబరాల్లో పాల్గొనలేరు అని అర్థమవుతోంది. ఒకవేళ పాల్గొన్నా కూడా కేవలం ఒకటి, రెండు సందర్భాల్లోనే కనిపించే అవకాశం ఉంది. గతంలో మాదిరి ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు. కవిత విదేశాల్లో కూడా బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేవారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ ఆడపడుచులను కూడా ఈ సంబరాల్లో భాగం చేసేవారు. అయితే ఇప్పుడు అనారోగ్య సమస్యల కారణంగా బతుకమ్మ సంబరాలకు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే రాజకీయ కార్యక్రమాల్లో కూడా కల్వకుంట్ల కవిత పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. ఇంటికే పరిమితం అవుతారని తెలుస్తోంది.

Show comments