Ambati Rambabu: భువనేశ్వరి పోటీ చేసినా.. ఓటమి తప్పుదు: అంబటి రాంబాబు

చంద్రబాబుకు రెస్ట్‌ ఇచ్చి కుప్పం నుంచి తాను పోటీ చేస్తానంటూ నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

చంద్రబాబుకు రెస్ట్‌ ఇచ్చి కుప్పం నుంచి తాను పోటీ చేస్తానంటూ నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

నారా భువనేశ్వరి కుప్పం సభలో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. 35 ఏళ్లుగా మీరు చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తున్నారు. ఇక ఆయనకు రెస్ట్‌ ఇవ్వాలనిపిస్తోంది. అందుకే ఈ సారి ఇక్కడి నుంచి నేను పోటీ చేయాలనుకుంటున్నాను అంటూ భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై రకరకాల ఊహాగానాలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బాబు మనసులోని మాటనే భువనేశ్వరి బయటపెట్టారంటున్నారు. అదలా ఉంచితే భువనేశ్వరి వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

‘‘కుప్పంలో చంద్రబాబు గ్రాఫ్‌ భారీగా పడిపోయింది. అక్కడ ఆయన కాదు కదా.. ఆయన భార్య నారా భువనేశ్వరి పోటీ చేసినా సరే ఓడిపోవాల్సిందే.. కుప్పంలో టీడీపీకి ఓటమి తప్పదన్నారు’’ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎప్పుడో టీడీపీ కుర్చీని మడతపెట్టేశారు. రాజ్యసభలో ఆ పార్టీ ఖాళీ అవ్వడమే ఇందుకు నిదర్శనం. ఇక కుప్పంలోనూ ఇదే పరిస్థితి వస్తుంది అన్నారు. అంతేకాక ఎన్నో ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గానికి కనీసం తాగునీరు కూడా ఇప్పించలేకపోయారని విమర్శించారు.

‘‘కుప్పంలో అభివృద్ధి జరిగింది వైసీపీ హయాంలోనే అని ఈ సందర్భంగా మంత్రి అంబటి గుర్తు చేశారు. కుప్పనాకి హంద్రీనీవా నుంచి నీళ్లు తీసుకువచ్చింది సీఎం జగన్‌. అక్కడ టీడీపీ ఓటమి ఖాయం. అందుకే చంద్రబాబును రెస్ట్‌ తీసుకోమని ఆయన భార్యే చెప్పింది. చంద్రబాబు కుర్చీని భువనేశ్వరి మడతపెట్టారు. లోకేష్‌, భువనేశ్వరిలు కలిసి కుర్చీలు మడతపెడుతున్నారంటూ’’ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.

ఇక బాబుకు కుప్పంలో ఓటమి భయం పట్టుకుందని.. పోటీ నుంచి తప్పుకోవాలని భావించే ఆయన భార్య భువనేశ్వరి చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయించారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎందుకుంటే.. ఏడుసార్లు కుప్పం నుంచి గెలిచిన చంద్రబాబు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది శూన్యం. కుప్పానికి మంచి నీరు సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాకే. దాంతో బాబు గ్రాఫ్‌ దారుణంగా పడిపోయింది. ఈ క్రమంలోనే ఆయన కుప్పం నుంచి పోటీ చేయాలంటే భయపడుతున్నారని టీడీపీ కేడరే స్వయంగా చెప్పడం గమనార్హం.

Show comments