కేసీఆర్‌ క్రేజ్‌ అంటే ఇది.. BRSలో మరో పార్టీ విలీనం

పట్టుబట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించి.. ఆ తర్వాత అభివృద్ధే ధ్యేయంగా.. సరికొత్త సంక్షేమ పథకాలతో.. ముందుకు సాగుతున్నారు సీఎం కేసీఆర్‌. తమ సంక్షేమ విధానాలను దేశ వ్యాప్తంగా అమలు చేయడం కోసం బీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చి.. మిగతా రాష్ట్రాల్లో విస్తరించే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో బీఆర్ఎస్‌ విస్తరణపై దృష్టి పెట్టారు కేసీఆర్‌. దానిలో భాగంగా మరాఠ గడ్డపై.. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ.. పార్టీ విధానాలను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్‌.

బీఆర్‌ఎస్‌ విధనాలు నచ్చడంతో మహారాష్ట్రలో పలువురు కీలక నేతలు పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పక్క రాష్ట్రాల్లో కేసీఆర్‌ క్రేజ్‌ ఎలా ఉందంటే.. నేతలు మాత్రమే కాక ఏకంగా పార్టీలు కూడా బీఆర్‌ఎస్‌లో విలీనం అవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలోని క్రాంతికారీ శేత్కరీ పార్టీని బీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించగా.. ఇప్పుడు మరో పార్టీ బీఆర్‌ఎస్‌లో విలీనం అయ్యింది. ఆ వివరాలు..

మహారాష్ట్రకు చెందిన స్వరాజ్య మహిళ సంఘటన్‌ పార్టీ బీఆర్ఎస్‌లో విలీనమైంది. సీఎం కేసీఆర్‌ సమక్షంలో స్వరాజ్య మహిళ సంఘటన్ అధ్యక్షురాలు వనితా తాయి గుట్టే, మిగతా సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణలో అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు.. మరీ ముఖ్యంగా మహిళా సంక్షేమం కోసం తీసుకువచ్చిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తమని మాత్రమే కాక దేశాన్ని కూడా ఆకర్షిస్తున్నాయన్నారు.

ఇలాంటి విధానాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలని కోరుకుంటున్నామని.. అందుకే అందుకే తమ పార్టీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నామని.. స్వరాజ్య మహిళ సంఘటన్ అధ్యక్షురాలు వనితా తాయి గుట్టే తెలిపారు. వీళ్లతో పాటు మహారాష్ట్ర బీజేపీ నాయకులు భయ్యా సాహెల్ పాటిల్, అర్జున్ వాంఖడే కూడా బీఆర్‌ఎస్‌లో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక వీళ్లే కాకుండా.. ఎన్సీపీ కార్పొరేటర్ జయంత్ చౌదరి, శివసేన నాయకుడు దత్తరాజ్ దేశ్ ముఖ్ తదితరులు కూడా బీఆర్‌ఎస్‌లో చేరారు.

Show comments