iDreamPost
android-app
ios-app

లోకేష్‌ పరువు తీసిన కిషన్‌రెడ్డి.. అమిత్‌షాతో భేటీపై సంచలన వ్యాఖ్యలు

  • Published Oct 23, 2023 | 6:19 PM Updated Updated Oct 23, 2023 | 6:19 PM

చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత.. లోకేష్‌, కేం‍ద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పైగా తానేమి అమిత్‌ షాని కలవడానికి సమయం అడగలేదన్నాడు లోకేష్‌. తాజాగా కిషన్‌రెడ్డి దీనిపై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌ పరువు తీశారు. అసలేం జరిగింది అంటే.. 

చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత.. లోకేష్‌, కేం‍ద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పైగా తానేమి అమిత్‌ షాని కలవడానికి సమయం అడగలేదన్నాడు లోకేష్‌. తాజాగా కిషన్‌రెడ్డి దీనిపై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌ పరువు తీశారు. అసలేం జరిగింది అంటే.. 

  • Published Oct 23, 2023 | 6:19 PMUpdated Oct 23, 2023 | 6:19 PM
లోకేష్‌ పరువు తీసిన కిషన్‌రెడ్డి.. అమిత్‌షాతో భేటీపై సంచలన వ్యాఖ్యలు

ఏపీ స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత.. ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రముఖంగా ప్రచారం చేసి.. సానుభూతి పొందాలనే ఉద్దేశంతో నారా లోకేష్‌ ఢిల్లీ వెళ్లారు. కానీ పాపం ఆయన అనుకున్నట్లు ఏం జరగలేదు. అసలు లోకేష్‌ని పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యాడు లోకేష్‌.

ఈ భేటీ గురించి లోకేష్‌ చెప్పిన వ్యాఖ్యలు చూస్తే.. బీజేపీకి టీడీపీకి మధ్య మంచి బాండ్‌ ఉందేమో అన్న అనుమానం కలిగింది. అమిత్‌ షానే తనను కలవాలనుకున్నారని.. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ఇందుకు సంబంధించి తనకు ఫోన్‌ చేశారని చెప్పాడు లోకేష్‌. కిషన్‌ రెడ్డి ఫోన్‌ చేయడం వల్లనే తాను అమిత్‌ షాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లానని చెప్పుకొచ్చాడు లోకేష్‌. ఈ క్రమంలో తాజాగా కిషన్‌రెడ్డి దీనిపై స్పందిస్తూ.. లోకేష్‌ పరువు తీశాడు. ఆ వివరాలు..

లోకేష్‌ పరువు తీసిన కిషన్‌రెడ్డి..

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. నారా లోకేష్‌, అమిత్‌ షాని కలవడంంలో తన పాత్ర ఏమి లేదని స్పష్టం చేశారు. అమిత్‌ షాతో భేటీ కోసం.. లోకేషే పదే పదే అపాయింట్‌మెంట్‌ అడిగాడని అసలు విషయం చెప్పాడు కిషన్‌ రెడ్డి. ఢిల్లీలో ఉన్న పది రోజుల్లో.. లోకేష్‌ అనేకసార్లు.. అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోసం రిక్వెస్ట్‌ చేశారని వెల్లడించాడు కిషన్‌రెడ్డి. అయితే అమిత్‌ షా బిజీ షెడ్యూల్‌ కారణంగా.. లోకేష్‌ను కలవలేదని వెల్లడించారు. కానీ లోకేష్‌ పదే పదే కోరడంతో.. అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు అని అసలు విషయం చెప్పుకొచ్చారు కిషన్‌ రెడ్డి.

అంతేకాక ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక కేంద్ర మంత్రిని నేనే కావడంతో.. ఆ భేటీకి హాజరయ్యాను. లోకేష్‌, అమిత్‌ షాను కలవడంలో నా పాత్ర ఏమీ లేదు. లోకేష్‌ పదే పదే కోరడం వల్లనే అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. కేంద్ర హోం మంత్రిగా అమిత్‌ షా చాలా మందిని కలుస్తారు. ఆఖరికి ప్రత్యర్థులు అపాయింట్‌మెంట్‌ అడిగినా సరే.. అమిత్‌ షా అందుకు ఓకే చెప్తారు’’ అంటూ అసలు వాస్తవాలు వెల్లడించారు.

ఏం సమాధానం చెప్పాలో తెలియక..

కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఎలా స్పందిచాలో టీడీపీ నేతలకు అర్థం కావడం లేదు. ఇన్ని రోజులుగా వాళ్లు చేసుకుంటున్న అసత్య ప్రచారానికి కిషన్‌ రెడ్డి బ్రేక్‌ వేశారు. అమిత్‌ షానే తనను కలవడం కోసం ఆసక్తి చూపారంటూ లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీలో సంచలనంగా మారాయి. అంటే ఈ రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయా అనే అనుమానం వ్యక్తం అయ్యింది. పైగా బీజేపీ పెద్దలు.. గతంలో చంద్రబాబు చేసిన అవమానాన్ని మర్చిపోయారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఇక తాజాగా కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలతో లోకేష్‌ చేస్తోన్న అసత్య ప్రచారానికి చెక్‌ పడింది.

ఇక కిషన్‌ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీరుపై ఆ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీకు మీకు మధ్య వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉన్నా సరే.. బయట మాత్రం.. మీరు పని చేస్తోన్న పార్టీకి విశ్వాసంగా ఉండాలి. లోకేష్‌ అసత్య ప్రచారం చేసుకుంటూ.. ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాని అవమానిస్తుంటే స్పందించకుండా ఉంటారా.. అంటూ మీకు పార్టీ కన్నా.. కుటుంబమే ముఖ్యమా అని ప్రశ్నిస్తున్నారు. మరి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలపై లోకేష్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.