Tirupathi Rao
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పలు సర్వేలు తమ రిపోర్టులను వెల్లడిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పలు సర్వేలు తమ రిపోర్టులను వెల్లడిస్తున్నాయి.
Tirupathi Rao
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి కనిపిస్తోంది. అధికార వైసీపీ వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తుండగా.. ప్రతిపక్షం మాత్రం కూటములతో వచ్చి వైసీపీని ఢీకొట్టాలని వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఈసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది వైసీపీనే అంటూ ప్రజలు కూడా గట్టిగా చెబుతున్నారు. అందుకు సంబంధించి తాజాగా ఏపీలో ప్రముఖ సర్వే సంస్థ జన్మత్ పోల్స్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే లెక్కల ప్రకారం ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 118 నుంచి 120 సీట్లు ఖాయమని తెలుస్తోంది. టీడీపీ- జనసేన కూటమికి 44-46 సీట్లు ఆస్కారం ఉందని వెల్లడించారు. అంతేకాకుండా ప్రాంతాల వారీగా ఏ పార్టీకి ఎంత బలం అనే విషయాన్ని కూడా స్పష్టంగా వివరించారు.
ప్రాంతాల వారీగా చూసుకుంటే కోస్తాలో తెలుగుదేశం పార్టీ, జనసేనలకు బలం ఎక్కువగా ఉంటుందని అందరూ భావిస్తుంటారు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో కమ్మ, కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువకాబట్టి. గుంటూరు, విజయవాడలో టీడీపీ కూటమికి ఓట్లు ఎక్కవ వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తూ ఉంటారు. కానీ, ఈ రెండు జిల్లాల్లో కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీకే ఓటర్లు మొగ్గు చూపుతున్నారనే విషయం వెల్లడైంది. గుంటూరు, విజయవాడ ప్రాంతాల ప్రజల్లో పురుషులు 46 శాతం వరకు జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. మహిళల్లో అత్యధికంగా 65 శాతం వరకు ఓటర్లు వైసీపీవైపే మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండే సామాజిక సమీకరణాల్లో రెండు ప్రధాన పార్టీలు తమకే మెజారిటీ లభిస్తుందని అంచనా వేస్తున్నాయి. కానీ, గ్రౌండ్ రియాలిటీలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Andhra pradesh assembly election 2024
Total seat (175)YSRCP 118-120
TDP+JSP =44-46#Andhrapardeshelection2024
— Janmat polls (@Janmatpolls) January 2, 2024
ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ప్రతిపక్షానికి కాస్త ఆధిక్యం ఉండే అవకాశం ఉందని చెబుతున్నా.. జగన్ వైపు మొగ్గు చూపే వారు కూడా అధికంగానే ఉన్నారంటూ సర్వే ద్వారా వెల్లడైంది. ఓవరాల్ గా చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద ఈ 34 నియోజకవర్గాల్లో మాత్రం అధికార, ప్రతిపక్షాల మధ్య గట్టిపోటి ఉండే ఆస్కారం ఉందని చెబుతున్నారు. రాయలసీమలో పరిస్థితి చూస్తే.. 65 శాతం నుంచి 70 శాతం వరకు వైసీపీనే లీడ్ లో ఉంది. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురంలో ఉండే పేద ప్రజలు, బలహీన, అట్టడుగు వర్గాలు మాత్రం జగన్ వైపే ఉన్నాయంటూ సర్వేలో తెలియజేశారు. 2019లో తెలుగు దేశం పార్టీకి గ్రేటర్ రాయలీసమ(కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం)లో వచ్చిన సీట్లు 7 మాత్రమే. ఈసారి మాత్రం గ్రేటర్ రాయలసీమలో 20 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
ఉత్తరాంధ్రలో విశాఖ 15, విజయనగరం 9, శ్రీకాకుళం 10 స్థానాలు ఉన్నాయి. 2019లో విజయనగంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి కూడా వైసీపీ ఆధిపత్యం మాత్రం కొనసాగుతుందనే విషయాన్ని వెల్లడిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కాస్త పోటీ ఉండే ఆస్కారం ఉందని చెబుతున్నారు. ఈ సర్వే ప్రకారం ఓవరాల్ గా చూస్తే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి వస్తున్నా ప్రజల మద్దతు 55 నుంచి 60 శాతం వరకు వైసీపీకే ఉందని స్పష్టం చేశారు. తెదేపా- జనసేన కూటమికి కేవలం 45 శాతం మేరకే పరిమితమయ్యే ఆస్కారం ఉందని చెబుతున్నారు. సీట్ల ప్రకారం చూసుకుంటే 110 నుంచి 120 స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయం అంటూ సర్వే ద్వారా వెల్లడైంది. ఈ సంస్థ తెలంగాణ ఎన్నికల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి 61 నుంచి 63 సీట్లు వస్తాయంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సర్వేకి ఇప్పుడు ఏపీలో ప్రాముఖ్యత సంతరించుకుంది.