iDreamPost
android-app
ios-app

సర్వేల్లో YCP ప్రభంజనం.. జగనే మళ్లీ CM.. ఇదిగో లెక్కలు

  • Published Mar 05, 2024 | 8:13 AM Updated Updated Mar 05, 2024 | 8:13 AM

India TV CNX Opinion Poll 2024: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు మరి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో అనేక సర్వే సంస్థలు ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనే దానిపై రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఇక తాజాగా ఓ సర్వే సంస్థ తన రిపోర్టు వెల్లడించింది. ఆ వివరాలు..

India TV CNX Opinion Poll 2024: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు మరి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో అనేక సర్వే సంస్థలు ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనే దానిపై రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఇక తాజాగా ఓ సర్వే సంస్థ తన రిపోర్టు వెల్లడించింది. ఆ వివరాలు..

  • Published Mar 05, 2024 | 8:13 AMUpdated Mar 05, 2024 | 8:13 AM
సర్వేల్లో YCP ప్రభంజనం.. జగనే మళ్లీ CM.. ఇదిగో లెక్కలు

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అధికార విపక్ష పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలు, అభ్యర్థుల ప్రకటనతో బిజీగా ఉన్నాయి. ఇక ఎన్నికల కదన రంగంలో వైసీపీ దూసుకుపోతుండగా.. విపక్ష కూటమి మాత్రం.. ఇంకా అభ్యర్థులను కూడా పూర్తిగా ప్రకటించలేదు. ఇక ఎన్నికల కోసం అధికార పార్టీ.. సిద్ధం పేరుతో సమర శంఖాన్ని పూరించింది. ఇక విపక్ష కూటమి జెండా పేరుతో సభ నిర్వహించినా.. వారి భవిష్యత్తు ప్రణాళిక ఏంటి.. ప్రజలకు ఏం చేస్తారు అనేది చెప్పకుండా.. కేవలం జగన్‌ మీద విమర్శలు చేయడానికే కేటాయించారు. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటడంతో.. అనేక సర్వే సంస్థలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి.. పబ్లిక్‌ పల్స్‌ని పట్టుకునే పనిలో ఉన్నాయి. ఇప్పటికే వెల్లడైన సర్వేలన్ని ఏపీలో వైసీపీదే ప్రభంజనం అని నొక్కివక్కాణించగా.. తాజాగా మరో సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఆ వివరాలు..

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో సర్వే సంస్థలన్ని రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు ఇండియా టీవీ, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, జీ న్యూస్-మ్యాట్రిజ్ సంస్థలు తమ సర్వే రిపోర్టులను వెల్లడించిన విషయం తెలిసిందే. అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టాయి. వరుసగా రెండోసారి కూడా జగనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంచనా వేశాయి. ఇక తాజాగా మరో సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. అదే ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్‌.

దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ ఒపీనియన్ పోల్‌ను నిర్వహించింది ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్‌ సంస్థ. ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ మెజారిటీ సంఖ్యలో లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటాయనే విషయంపై తన అంచనాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే.. ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌ జనాలు మరోసారి వైఎస్ఆర్సీపీకే జైకొట్టారు. మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో అధికార పార్టీ ఆధిపత్యం కనిపించింది. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. వైఎస్ఆర్సీపీ 15-18 చోట్ల విజయం సాధిస్తుందని ఈ సర్వే సంస్థ వెల్లడించింది. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం-జనసేన కూటమి 7-10 స్థానాలకే పరిమితమౌతుందని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ అంచనా వేసింది.

దీన్ని ప్రాతిపదికన తీసుకుంటే.. అసెంబ్లీ బరిలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయం. మొత్తంగా వైసీపీ 105-126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘన విజయాన్ని అందుకుంటుంది. సంక్షేమం, అభివృద్ధి వైపే మొగ్గు చూపారని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ పేర్కొంది. వైసీపీ ప్రభుత్వం పట్ల జనాల్లో పెద్దగా వ్యతిరేకత లేదని.. జగన్‌ పాలనపై మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సర్వే వెల్లడించింది.