iDreamPost
android-app
ios-app

జగన్ సర్కారుకు మరో శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభత్వం!

జగన్ సర్కారుకు మరో శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభత్వం!

సాధారణంగా కేంద్ర- రాష్ట్ర ప్రభత్వాల మధ్య ఎప్పడూ సఖ్యత, సానుకూల స్పందన ఉంటుంది అనే నమ్మకం ఉండదు. కానీ, సీఎం జగన్ మాత్రం కేంద్రంతో ఎప్పుడూ సఖ్యతగానే ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రతి అంశాన్ని ఢిల్లీ పెద్దల ముందు ఉంచి.. పనులు వేగంగా జరిగేలా చూస్తారు. తాజాగా కేంద్రం ఏపీ విషయంలో, సీఎం జగన్ విషయంలో స్వరం మార్చినా కూడా.. ఏపీ ప్రభుత్వం విషయంలో మాత్రం సానుకూలంగా ఉన్నారు. సీఎం జగన్ ఏ విజ్ఞప్తి చేసినా సత్వరమే స్పందిస్తుంటారు.

తాజాగా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకీ రావాల్సిన రూ.114 కోట్ల బకాయిల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించింది. రాష్ట్రం నుంచి పొరుగు రాష్టా్రాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్లకు ఆయా రాష్ట్రాలు ఏపీ ట్రాన్స్ కో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఆయా రాష్ట్రాలు చంద్రబబు హయాం నుంచి నిమ్మకు నీరెత్తనట్లు ఉన్నాయి. జగన్ సర్కారు ఏర్పాటైన తర్వాత కూడా రాష్ట్రాల బకాయిల విషయంలో నోరెత్తలేదు. ఇంక వేరే దారిలేక ఏపీ ప్రభుత్వం బకాయిలు ఇప్పించాలంటూ కేంద్రాన్ని  కోరింది. 2014-15 నుంచి 2018-19 వరకు పెండింగ్ పడిపోయిన బకాయిలను రాష్ట్రాలు చెల్లించడం లేదు. కేంద్రం కూడా ఈ విషయంలో స్పందించలేదు.

ఆ బకాయిలను, సరఫరా నష్టాల్ని సైతం వసూలు చేసుకునేందుకు అనుమతివ్వాలంటూ ట్రాన్స్ కో తరఫున ప్రభుత్వం విజ్ఞప్తులు చేసింది. ఆ విజ్ఞప్తులపై కేంద్రం స్పందించింది. విచారణ జరిపిన తర్వాత రూ114 కోట్ల బకాయిలను వసూలు చేసుకునేందుకు అనుమతులు జారీ చేసింది. అయితే 214-15 నుంచి 2018-19 వరకు మాత్రమే బకాయిలు వసూలు చేసుకోవాలంటూ కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుతులిచ్చింది. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వరుస విజ్ఞప్తులు చేసి బకాయిల వసూలు విషయంలో జగన్ ప్రభుత్వం విజయం సాధించింది.