వీడియో: MLC కవిత కాళ్లు మొక్కిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి!

EX MLA Jeevan Reddy, MLC Kavitha: గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎర్రవల్లిలోని తన తండ్రిని కలిశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఒకరు కవిత కాళ్లు మొక్కారు.

EX MLA Jeevan Reddy, MLC Kavitha: గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎర్రవల్లిలోని తన తండ్రిని కలిశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఒకరు కవిత కాళ్లు మొక్కారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసింది. దాదాపు 5 నెలల తరువాత తీహార్ జైలు నుంచి ఆమె బయటకు వచ్చారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇది ఇలా ఉంటే..గురువారం ఆసక్తికరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కవిత కాళ్ళకు మొక్కారు. ప్రస్తుతం ఈ సంఘటన చర్చనీయాశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గురువారం ఎమ్మెల్సీ కవిత తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ఎర్రవల్లికి వెళ్లింది. అక్కడ తన తండ్రిని కలిసే సందర్భంలో ఆయన నివాసం వద్ద బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆమెకు ఆహ్వానం పలికారు. ఆమె కారు దిగి లోపలికి వచ్చే క్రమంలో అక్కడే ఉన్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కవిత కాళ్లకు నమష్కారం చేశాడు. ఇలా ఆయన నమష్కారం చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడమే కాకుండా చర్చనీయాశంగా మారింది. ఇది ఇలా ఉంటే.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వయసులో కవిత కంటే పెద్దవారు. అలాంటి వ్యక్తి ఆమె కాళ్లకు నమస్కారం చేయడం ఏంటని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అలా వయస్సులో తన కంటే పెద్ద వాడైన జీవన్ రెడ్డి.. కాళ్లు మొక్కేటప్పుడు కవిత కూడా తిరస్కరించకపోవడం గమనార్హం.

కవితకు జీవన్ రెడ్డి కాళ్లు మొక్కడంపై ఇతర పార్టీల నేతలు ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ స్వామి భక్తి ఏంటి అంటూ మండిపడుతున్నారు. అయితే జీవన్ రెడ్డి అభిమానంతో  అలా చేశారని, తప్పేముందని పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు సమర్ధిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. జైలు నుంచి రిలీజ్ అయిన తరువాత గురువారం తొలిసారి తండ్రితో కవిత భేటీ అయ్యారు. ఐదున్నర నెలల తర్వాత తండ్రిని కలిసిన ఆమె కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నరు. కన్నబిడ్డను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక నేటి నుంచి దాదాపు 10 రోజుల పాటు ఆమె ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లోనే ఉండనున్నారు. ఈ క్రమంలో తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని కవిత కార్యకర్తలకు, నాయకులకు,అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మొత్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు వీక్షించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments