రాజకీయ నాయకులు సభలు, ఓపెనింగ్స్ వంటి కార్యక్రమాలకు వెళ్తున్నారు అంటే ఆడవాళ్లతో హారతులు ఇవ్వడం, తిలకాలు దిద్దడం చూస్తూనే ఉంటాం. నాయకులపై అభిమానంతో అలా చేస్తుంటారు. అలాగే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఏ కార్యక్రమానికి వెళ్లినా ఆయనకు మంగళహారతులు ఇస్తూ ఉంటారు. అలాగే తాజాగా ఒక కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ కూడా ఆయనకు హారతి ఇచ్చి తిలకం దిద్దారు. ఎప్పుడూ లేనిది ఈసారి మాత్రం ఫడ్నవీస్ కళ్లు చెమర్చాయి.
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అంటే ప్రజల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ కార్యక్రమానికి వెళ్లినా మంగళహారతులతో ఆడవాళ్లు క్యూ కడతారు. అలాగే తాజాగా ఆయన జలగావ్ ప్రాంతంలో ప్రత్యేక అవసరాలు ఉన్న వారి కోసం దీపస్తంబ్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయనకు ఒక దివ్యాంగురాలు అయిన యువతి మంగళహారతి ఇచ్చింది. ఆ తర్వాత తిలకం దిద్దింది. ఆమెకు రెండు చేతులు లేవు. ఈ క్రతువు మొత్తాన్ని తన కాళ్లతోనే చేసింది. ఆ దృశ్యం చూసిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ ఎమోషనల్ అయ్యారు. తన భావాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
“నేను ఇప్పటి వరకు ఎంతో మంది తల్లులు, సోదరీమణుల వద్ద ఆశీర్వాదం, హారతి తీసుకున్నాను. తిలకం దిద్దించుకున్నాను. ఇప్పుడు నాకు తిలకం దిద్దేందుకు ఓ సోదరి బొటనవేలు నా నుదిటి వద్దకు చేరింది. కానీ, అది చేతి బొటన వేలు కాదు.. కాలి బొటన వేలు. మన జీవితంలో ఎదురయ్యే ఇలాంటి సంఘటనలు మనల్ను భావోద్వేగానికి గురి చేస్తాయి. మన కళ్లను చెమర్చేలా చేస్తాయి. నాకు ఆమె కాలి వేళ్లతోనే తిలకం దిద్దింది, హారతి ఇచ్చింది. ఆ సమయంలో ఆమె ముఖంలో చిరునవ్వు, కళ్లలో మెరుపు కనిపించింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ధైర్యంగా నేను దాటగలను, నాకు ఎవరి జాలి, దయ అక్కర్లేదు అని చెప్పినట్లు అనిపించింది” అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు. ఆ ట్వీట్, ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
आज तक कई माताओं-बहनों ने आशीर्वाद स्वरूपी आरती की, तिलक लगाया।
आज भी उसी भावना के साथ एक अंगूठा मेरे माथे पर तिलक लगाने के लिए पहुंचा… पर इस बार ये हाथ का नहीं पांव का अंगूठा था।
जीवन में आने वाले ऐसे क्षण झकझोर देते हैं, आँखों को नम कर देते हैं, पर सिर्फ कुछ पल के लिए।… pic.twitter.com/pqpqeO3Kbo— Devendra Fadnavis (@Dev_Fadnavis) June 27, 2023