P Venkatesh
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే తెలంగాణ సీఎంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ ను ఎంపిక చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే తెలంగాణ సీఎంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ ను ఎంపిక చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
P Venkatesh
తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ఎవరన్నది తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ రథసారథి ఎనుముల రేవంత్ రెడ్డినే అధిష్టానం తెలంగాణ సీఎంగా ప్రకటించింది. పట్టిన పట్టు విడవకుండా రాజీలేని పోరాటం చేసిన రేవంత్ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. తన మాటల తూటాలతో యూత్ లో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారు. నేడు హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డినే అని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్ కే సీఎం పదవిని కట్టబెట్టింది. పార్టీలో ఎంతో మంది సీనియర్ లీడర్లు ఉన్నప్పటికీ వారందరినీ కాదని రేవంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం ఏంటనీ మీకు సందేహం కలుగొచ్చు. అది నిజమే. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్ ను డైరెక్ట్ గా సీఎంగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఆ వివరాల్లోకి వెళ్తే..
పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి, కార్యకర్తలకు కొండంత బలాన్నిచ్చి హస్తం పార్టీని విజయతీరాలకు చేర్చిన మాస్ లీడర్ రేవంత్ రెడ్డి. సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ మునిగిపోయే పడవ అంటూ ఎద్దేవ చేస్తూ పార్టీని వీడారు. అయినా అధైర్యపడకుండా యోధుడిలా తన శక్తినంతా ధారబోసి తెలంగాణలో పార్టీ మనుగడకు కారణమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదన్న ప్రతిపక్ష లీడర్ల నోళ్లు మూయించారు. అంతిమంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలు కైవసం చేసుకుని నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందింది ఎప్పుడెప్పుడంటే.. 2008 లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన రేవంత్ గెలుపొందారు. ఆ తర్వాత 2009లో టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా పనిచేసిన రేవంత్ కు ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు కొడంగల్ టికెట్ కేటాయించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కొడంగల్ నుంచి విజయం సాధించారు.
ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్రంగా ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున కొడంగల్ నుంచి పోటీ చేసి విజయదుందుభి మోగించారు. ఈ క్రమంలో తెలంగాణలో రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్న వేళ టీడీపీలో ఉంటే తన రాజకీయ భవిష్యత్ కు ఆటంకం కలుగుతుందని భావించిన రేవంత్ 2017లో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచి బరిలోకి దిగారు రేవంత్ రెడ్డి. కానీ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాగా రేవంత్ నాయకత్వ పటిమను గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఇక 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేశారు రేవంత్ రెడ్డి.
ఎంపీ ఎన్నికల్లో గెలుపొంది మొదటిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఇక తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు రేవంత్ రెడ్డి. కాగా కామారెడ్డిలో ఓడిపోగా కొడంగల్ నుంచి విజయం సాధించారు. ఈ ప్రకారంగా రేవంత్ రెడ్డి హస్తం పార్టీ నుంచి మొదటి సారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కాంగ్రెస్ నుంచి మాత్రం ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరి హస్తం పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.