సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతాం..: CM రేవంత్ రెడ్డి

Revanth Reddy, Rajiv Gandhi Statue: రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు విషయంలో తెలంగాణలో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తాము అధికారంలోకి వస్తే.. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని అంటున్న బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy, Rajiv Gandhi Statue: రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు విషయంలో తెలంగాణలో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తాము అధికారంలోకి వస్తే.. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని అంటున్న బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం సచివాలయం ప్రాంగణంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది. త్వరలోనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాము అధికారంలోకి రాగానే.. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విగ్రహం అంశం గురించి ప్రస్తావించారు. రాజీవ్ గాంధీ 80 జయంతి సందర్భంగా సోమాజీగూడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్.. బీఆర్ఎస్ నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతామన్నారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు. ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే..వారి మోత మోగిస్తామన్నారు. పేదలకు భూములు పంచిన ఘనత రాజీవ్ దని, దేశంలో ఐటీ అభివృద్ధి చేసింది ఆయనే అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, కంప్యూటర్ రివల్యూషన్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ అని సీఎం అన్నారు. పేదలకు భూములు పంచిన ఘనత రాజీవ్ దని, దేశంలో ఐటీ అభివృద్ధి చేసింది ఆయనే అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని  సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం బయటకాదు సచివాలయం లోపల పెడతామన్నారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు బలుపు తగ్గలేదంటూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపాజిట్లు కోల్పోయిన మీరు మళ్లీ అధికారంలోకి వస్తారా అంటూ సీఎం ఎద్దేవా చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేందుకు ఎప్పుడు వస్తారో చెప్పండి అంటూ బీఆర్ఎస్ నేతలపై సీరియస్ అయ్యారు.

ఇదే సమయంలో బీజేపీపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని మోదీ,అమిత్ షా..అదానీ,అంబానీలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. సెబీ అక్రమాలపై కేసీఆర్, కేటీఆర్ లు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. హెండెన్ బర్గ్ నివేదికపై విచారణ జరిపించాలని, సెబీ ఛైర్మన్ పై వచ్చిన ఆరోపణలపై చట్ట సభల్లో కాంగ్రెస్  పోరు చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. అదానీని కాపాడేందుకు మోదీ ప్రయత్నం చేస్తున్నారని, అదానీపై జేపీతో విచారణ జరిపించాలని రాహుల్ డిమాండ్ చేశారని గుర్తు చేశారు.

ప్రతి చిల్లర విషయంలో స్పందించే కేటీఆర్ అదానీ అవినీతి అంశంపై ఎందుకు స్పందించరని ప్రశ్నించాడు. బీజేపీ,బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉంది కాబట్టే మాట్లాడటం లేదని సీఎం అన్నారు. రాష్ట్రంలో గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి..కాంగ్రెస్ పాలనపై చర్చకు తాను రెడీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మరి..మొత్తంగా సీఎం రేవంత్  రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments