Revanth Redd-MLC To Kodandaram: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. కోదండరాంకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం

Revanth Reddy: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. కోదండరాంకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు.. తాను ఇచ్చిన మాటలను కూడా నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో తాజాగా ఆక్ష్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు.. తాను ఇచ్చిన మాటలను కూడా నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో తాజాగా ఆక్ష్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ పార్టీలు, తెలంగాణ జనసమితి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఇక అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాక.. తాను ప్రత్యేకంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు సీఎం రేవంత్. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే రజినీకి ఉద్యోగం ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆరు గ్యారెంటీల అమలుకై చర్యలు వేగవంతం చేశారు. ఈ క్రమంలో తాజాగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు కోదండరాంకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అన్నారు. ఇంతకు రేవంత్ ఏం మాట ఇచ్చారంటే..

తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ న్యూస్ ఛానెల్ కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు ఇచ్చిన హామీ ప్రకారం పదవి ఇస్తామని తెలిపారు. ఎన్నికల ముందు ఆ పార్టీతో అవగాహన ఒప్పందం కుదిరిందని.. అందులో భాగంగా రెండు ఎమ్మెల్సీ పదవులు, కొన్ని ఛైర్మన్ పోస్టులు కూడా టీజేఎస్‌కు ఇవ్వడానికి రెడీగా ఉన్నామన్నారు రేవంత్. కోదండరాం అతి త్వరలో ఎమ్మెల్సీ కాబోతున్నారు. త్వరలోనే అది కార్యరూపం దాలుస్తుందని వెల్లడించారు. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాంని ఎమ్మెల్సీని చేస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

అంతేకాక ఎమ్మెల్సీగా ఎన్నిక కావటానికి కోదండరాంకి అన్ని అర్హతలున్నాయని… ఆయన లాంటి వ్యక్తులు చట్టసభల్లోకి వస్తే ఎన్నో విషయాలను ప్రస్తావించడానికి అవకాశముంటుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్. తెలంగాణ సమాజం ఆయనను కోరుకుంటున్నదని.. అనేక అంశాల మీద ఆయనకు అవగాహన, పట్టు ఉందని చెప్పారు. ఆయన లాంటి వ్యక్తుల్ని చట్టసభల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ఆయన రాక చట్టసభలకే గౌరవం కలిగిస్తుందన్నారు. లేదంటే రియల్ ఎస్టేట్, దళారులతో చట్టసభలు నిండిపోతాయని రేవంత్ వ్యాఖ్యనించారు.

అంతేకాక తాను తొలిసారి ఎమ్మెల్సీ అయినప్పుడు సభలో చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి హేమాహేమీలు ఉండేవారని గుర్తు చేసుకున్నారు రేవంత్. ఆలాంటి వాళ్ల దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవచ్చనే ఫీలింగ్ ఉండేదని.. వారు సభలోకి రాగానే లేచి నిలబడి వారి పట్ల తాము గౌరవం చూపించేవారమన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. కానీ త్వరలోనే కోదండరాంను చట్టసభల్లో చూస్తామని సీఎం క్లారిటీ ఇచ్చారు.

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ పోటీకి దూరంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశ్యంతోనే టీజేఎస్.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఆసమయంలో కోదండారంకు పదవి ఆఫర్ చేశారు. మరి రేవంత్ రెడ్డి ఆఫర్ ను కోదండరాం అంగీకరిస్తారా.. లేక పదవులు దూరంగా ఉంటారా అనేది చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments