iDreamPost
android-app
ios-app

కాకినాడలో జనసేనకు టికెట్‌ ఇస్తే చిత్తుగా ఓడిస్తాం: టీడీపీ కార్యకర్తలు

  • Published Feb 23, 2024 | 2:53 PM Updated Updated Feb 23, 2024 | 2:53 PM

జనసేన, టీడీపీల మధ్య సీట్ల పంపకం వివాదం రాజేస్తుంది. కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు జనసేనకు టికెట్‌ ఇస్తే ఓడిస్తాం అంటున్నారు. ఆ వివరాలు..

జనసేన, టీడీపీల మధ్య సీట్ల పంపకం వివాదం రాజేస్తుంది. కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు జనసేనకు టికెట్‌ ఇస్తే ఓడిస్తాం అంటున్నారు. ఆ వివరాలు..

  • Published Feb 23, 2024 | 2:53 PMUpdated Feb 23, 2024 | 2:53 PM
కాకినాడలో జనసేనకు టికెట్‌ ఇస్తే చిత్తుగా ఓడిస్తాం: టీడీపీ కార్యకర్తలు

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల మధ్య పొత్తు అయితే కుదిరింది కానీ.. సీట్ల పంపిణీ మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దానికి తోడు చాలా నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నేతలు మధ్య సయోధ్య కుదరడంలేదు. రెండు పార్టీల కార్యకర్తలు బహిరంగంగానే తన్నుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా టీడీపీ కార్యకర్తలు అల్టిమేటం జారీ చేశారు. కాకినాడ సీటు జనసేనకు ఇస్తే.. చిత్తు చిత్తుగా ఓడిస్తాం అంటూ హెచ్చరికుల జారీ చేశారు. ఆ వివరాలు..

పొత్తు పెట్టుకున్న జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంపకం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కానీ ఎక్కడికక్కడ నేతలు, ఆశావాహులు మాత్రం టికెట్‌ తమకే అంటే తమకే అని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా కాకినాడ రూరల్‌ సీటు.. రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. టీడీపీని కాదని కాకినాడ రూరల్‌ టికెట్‌ను జనసేనకు కేటాయిస్తే.. ఆ పార్టీ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడిస్తామంటూ టీడీపీ కార్యకర్తలు అల్టిమేటం జారీ చేశారు.

ఇక కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కోసం జనసేన, టీడీపీ పార్టీ అభ్యర్థులు గట్టిగా పట్టుబడుతున్నారు. ఇక్కడ జనసేన పార్టీ నుంచి పంతం నానాజీ సీటు ఆశిస్తుండగా.. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే టీడీపీ కార్యకర్తలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ కాదని జనసేనకు టికెట్‌ కేటాయిస్తే.. చిత్తు చిత్తుగా ఓడిస్తాం అని అనంత లక్ష్మి అభిమానులు మీడియా ముందు హెచ్చరించారు.

అంతేకాక కాకినాడ లోక్‌సభ స్థానంతో పాటుగా కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే టికెట్‌ కూడా జనసేనకు ఇస్తే.. ఇక టీడీపీ పార్టీ జెండా ఎక్కడ ఎగురుతుంది.. కింది స్థాయి కార్యకర్తలకు సమస్యలు వస్తే ఎవరిని అడగాలి.. అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధిష్టాన అనంతలక్ష్మికి కాదని జనసేనకు టికెట్‌ ఇస్తే.. ఆ పార్టీ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడిస్తాం అని తెలిపారు. అటు చూస్తే జనసేన కేడర్‌ కూడా కాకినాడ రూరల్‌ టికెట్‌ తమకే కేటాయించాలని పట్టుబడుతున్నారు. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.  కానీ కాకినాడ రూరల్‌ టికెట్‌ మాత్రం ఇరు పార్టీల మధ్య విభేదాలను తారాస్థాయికి తీసుకెళ్లింది.