ఢిల్లీకే పరిమితమైన లోకేష్‌.. అరెస్ట్‌ చేస్తారనే భయమా?

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. అరెస్టయ్యి జైల్లో ఉన్నారు. హైకోర్టులో కూడా ఆయనకు చుక్కెదురయ్యింది. ఆయనను సీఐడీ కస్టడికి అప్పగిస్తూ.. కోర్టు తీర్పు వెలువరించింది. స్కిల్‌ డెవపల్‌మెంట్‌ కేసులో.. చంద్రబాబుకు వ్యతిరేకంగా పక్కా ఆధారులండంతో.. ఆయన తరఫున ఎంతటి సీనియర్‌ మోస్ట్‌ న్యాయవాదులు వచ్చినా.. కోర్టులో వారి వాదనలు నిలవడలేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా ఉండగా.. తండ్రి అరెస్ట్‌ తర్వాత.. నారా లోకేష్‌ ఢిల్లీ వెళ్లారు.

చంద్రబాబు అరెస్ట్‌, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల గురించి ఢిల్లీ వేదికగా అందరికి చాటి చెబుతానంటూ.. సెప్టెంబర్‌ 14న.. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లాడు లోకేష్‌. కానీ తాను అనుకున్న ఫలితం దక్కలేదు. ఒకటి, రెండు జాతీయ ఛానల్స్‌ మినహా.. లోకేష్‌ను పట్టించుకున్న నాథుడే లేదు. జాతీయ స్థాయిలో తమకు ఇలాంటి అవమానం జరుగుతందని ఎక్స్‌పెక్ట్‌ చేయని లోకేష్‌.. దాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం.. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో.. ఎంపీలతో సమావేశం అవుతాను అంటూ.. మరో నాలుగు రోజులు అక్కడే ఉన్నారు.

ఈలోపు చంద్రబాబు స్కామ్‌లన్ని ఒక్కొటి బయటకు రాసాగాయి. ఈ క్రమంలో ఫైబర్‌ నెట్‌ స్కామ్‌ బయటకు వచ్చింది. దీనిలో నారా లోకేష్‌పై ప్రధానంగా ఆరోపణలున్నాయి. వీరు అక్రమంగా సంపాదించారని.. షెల్‌ కంపెనీలకు అనుమతించారనేది ప్రధాన అభియోగం. ఇక లోకేష్‌ ఢిల్లీ నుంచి ఏపీకి వస్తే.. ఫైబర్‌ నెట్‌ కేసులో భాగంగా.. ఆయన కూడా జైలుకు వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అరెస్ట్‌కు భయపడే.. లోకేష్‌.. ఢిల్లీ నుంచి రావడం లేదనే టాక్‌ వినిపిస్తోంది.

ఒకవేళ సీఐడీ అరెస్ట్‌ చేయాలంటే.. లోకేష్‌ ఢిల్లీలో ఉన్నా వదిలి పెట్టదు. ఆ విషయం లోకేష్‌కు కూడా తెలుసు. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నా అద్భుతాలు జరుగుతాయనే ఆశ కూడా లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్‌ ఇంకా ఢిల్లీలోనే ఉండటం ఎందుకు అని చర్చించుకుంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.

Show comments