Dharani
ఎన్టీఆర్ ఘాట్ వేదికగా.. నందమూరి కుటుంబంలోని విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలంటూ ఆర్డర్ వేశాడు బాలకృష్ణ. ఆ వివరాలు..
ఎన్టీఆర్ ఘాట్ వేదికగా.. నందమూరి కుటుంబంలోని విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలంటూ ఆర్డర్ వేశాడు బాలకృష్ణ. ఆ వివరాలు..
Dharani
గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్-నందమూరి బాలకృష్ణ మధ్య గ్యాప్ కొనసాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా చోటు చేసుకున్న ఓ సంఘటన చూస్తే.. ఈ ప్రచారం నిజమే అనిపిస్తోంది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూసిన బాలకృష్ణ అసహనంతో ఊగిపోయాడు. వాటిని వెంటనే తొలగించమంటూ.. తన పక్కనే ఉన్న వ్యక్తిని ఆదేశించాడు. ఎన్టీఆర్ ఫ్లెక్సీల వైపు చూస్తూ.. వెంటనే తీసేయ్ అనడమే కాక.. చేతులతో సైగ చేస్తూ అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..
టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్దంతి నేడు. ఈ క్రమంలో గురువారం వేకువ జామున జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ రామ్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని.. తాతకు నివాళి అర్పించారు. ప్రతీ ఏటా ఎన్టీఆర్ జయంతి, వర్దంతి నాడు తారక్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పిస్తారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా అదే విధంగా నివాళి అర్పించేందుకు తారక్ వచ్చాడు తారక్. అదే సమయంలో పెద్ద సంఖ్యలో అభిమానులకు అక్కడకు చేరుకున్నారు. జూనియర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు.
సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. కానీ, తారక్ వాటిపై ఏమాత్రం స్పందించలేదు. అంతేకాక ఎన్టీఆర్ ఘాట్ వద్ద భారీ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ కు అనుకూలంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. ఆ తరువాత నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళి అర్పించేందుకు ఘాట్ వద్దకు చేరుకున్నారు. కారు దిగగానే చుట్టూ పరిశీలించిన బాలయ్య.. అక్కడ ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి అసహనం వ్యక్తం చేశాడు. తన పక్కనే ఉన్న వ్యక్తిని చూస్తూ.. వెంటనే తీపించేయ్ అని ఆర్టర్ వేశాడు.
బాలయ్య ఆజ్ఞ మేరకు ఆ వ్యక్తి.. వేరే వారిని పిలిచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాల్సిందిగా సూచించాడు. దాంతో ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడే… తీయించేయ్!#NandamuriBalakrishna#JrNTR pic.twitter.com/FJhpvqSxsT
— Gulte (@GulteOfficial) January 18, 2024