iDreamPost
android-app
ios-app

పవన్‌ కంటే జగనే బెటర్‌! ఎన్నికల ముందు నిజం ఒప్పుకున్న మహాసేన రాజేశ్!

  • Published May 07, 2024 | 1:06 PM Updated Updated May 07, 2024 | 7:27 PM

Mahasena Rajesh: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. మహాసేన రాజేష్‌ చేసిన ప్రకటన ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు..

Mahasena Rajesh: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. మహాసేన రాజేష్‌ చేసిన ప్రకటన ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు..

  • Published May 07, 2024 | 1:06 PMUpdated May 07, 2024 | 7:27 PM
పవన్‌ కంటే జగనే బెటర్‌! ఎన్నికల ముందు నిజం ఒప్పుకున్న మహాసేన రాజేశ్!

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మే 13న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. సమయం దగ్గర పడుతుండటంతో.. పార్టీలన్నీ దూకుడు పెంచాయి. హోరాహోరి ప్రచారంతో ఎన్నికల హీటు పెంచుతున్నాయి. ఇక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్ది.. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా విపక్ష కూటమిలో అసంతృప్తులు ఇంకా సద్దుమనణగలేదు. పోలింగ్‌ ముందు వరకు కూడా పార్టీలు మారేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తెలుగు దేశం పార్టీలో చేరిన మహాసేన రాజేష్‌ ఎన్నికల ముందు.. కూటమికి ఊహించని షాకిచ్చారు. మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాక జనసేనను ఓడిస్తానంటూ వీడియో ద్వారా ప్రకటించారు. ఆ వివరాలు..

ఈ మేరకు.. ‘‘పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం. ఆయనతో పోలిస్తే.. మా వర్గాలకు జగన్ గారే బెటర్ అనిపిస్తుంది. కులం మతం పేరుతో అమాయకులపై దాడిచేసేవారు ఎవరైనా సరే.. అలాంటి వారికి వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్‌ గారు తెలిపారు. మేం ఇప్పుడు ఆ బాటలోనే పయనించేందుకు రెడీ అవుతున్నాం. పవన్‌ వల్ల జరిగే అనర్థాల గురించి ప్రజలకు తెలియజేస్తాం. ఇప్పటికే చాలా సహించాము.. ఇక ఊరుకోం. ఈ ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపుతాం. జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోను ఓడించడానికి రాజ్యాంగ బద్దంగా పనిచేస్తాం. మాకు రాజకీయాలు, పదవులు ముఖ్యం కాదు.. అన్యాయానికి గురవుతున్న ప్రజల తరపున పోరాడటమే మాకు ఇష్టం’’ అంటూ ఫేస్‌బుక్‌ వేదికగా ఓ ప్రకటన చేశారు. అలానే ఒక వీడియో కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఇది ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నెగ్గాలంటే వర్మ మద్దతు ఉండాలి. ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఒక జబర్దస్త్ టీమ్ ని, ఒక రికార్డింగ్ డ్యాన్స్ టీమ్ ని… సీరియల్ టీమ్ ని, హీరోలని.. ఇంతమందిని ఒక మహిళ మీద ఎందుకు దింపుతున్నారని ప్రశ్నించారు. జగన్ గారు ఎప్పుడైనా ఇలా చేశారా?ఎలా ఏమైనా చేశారా? అంటూ ప్రశ్నించారు. జగన్ క్యాబినెట్ లో ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు ఇలా అన్ని కులాల వారు మంత్రులుగా, ఉపముఖ్యమంత్రులుగా ఉంటారని.. జనసేన పార్టీలో ఎందుకు లేరని ప్రశ్నించారు. జనసేన పార్టీలో ప్రజాస్వామ్యం ఏమైందని.. ఎప్పటి నుంచో పని చేస్తున్న వాళ్ళని కాదని.. నిన్న గాక మొన్న వచ్చిన వాళ్లకి టికెట్లు ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. నిజాయితీ ఏమైంది అంటూ ప్రశ్నించారు.

మహాసేన రాజేష్‌ తీసుకున్న నిర్ణయం కూటమికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన నేతలు.. పవన్‌ నిర్ణయాల పట్ల చాలా అసంతృప్తితో ఉన్నారు. సీటు రాని జనసేన నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాక అనేక నియోజకవర్గాల్లో.. జనసేన నేతలు.. టీడీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. వారిని ఓడిస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో మహాసేన రాజేష్‌ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కూటమికి పెద్ద దెబ్బే అంటున్నారు రాజకీయ పండితులు.

ఇక​ తాజా ఎన్నికల్లో ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు.. మహాసేన రాజేష్‌కు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి గన్నవరం సీటు కేటాయించారు. కానీ చంద్రబాబు నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే వ్యతిరేకించారు. దాంతో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా రాజేష్‌ ప్రకటించారు. ఈ క్రమంలో మహాసేన రాజేష్‌కు కేటాయించిన సీటును.. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. ప్రస్తుతం మహాసేన రాజేష్‌ను.. టీడీపీ ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా నియమించింది.