iDreamPost
android-app
ios-app

బాలకృష్ణకు ముందే మెంటల్‌.. అసెంబ్లీకి రానివ్వొద్దు.. స్పీకర్‌ని కోరిన MLA మధుసూదన్‌

  • Published Sep 22, 2023 | 1:06 PM Updated Updated Sep 22, 2023 | 1:23 PM
  • Published Sep 22, 2023 | 1:06 PMUpdated Sep 22, 2023 | 1:23 PM
బాలకృష్ణకు ముందే మెంటల్‌.. అసెంబ్లీకి రానివ్వొద్దు.. స్పీకర్‌ని కోరిన MLA మధుసూదన్‌

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారు. చిల్లర వేషాలతో సభా మర్యాదను మంటల్లో కల్పుతున్నారు. ఇక హిందూపూర్‌ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అయితే.. సినిమాల్లో మాదిరి రెచ్చిపోతూ.. అసెంబ్లీలో ఉన్నాను అనే సోయి లేకుండా వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. 9 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ.. ఏనాడు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నోరు విప్పలేదు. కానీ నేడు ఆయన కుటుంబ సభ్యుడు.. బావ చంద్రబాబు జైల్లో ఉంటే మాత్రం.. అసెం‍బ్లీలో రచ్చ రచ్చ చేస్తున్నారు బాలయ్య.

మీసం మెలేయడం, తొడగొట్టడం, అసభ్యకర సంజ్ఞలు చేయడం మాత్రమే కాక.. నేడైతే ఏకంగా అసెంబ్లీలో విజిల్‌ ఊదుతూ చిల్లర వేషాలు వేశారు. బాలయ్య తీరుపై జనాలు పెద్ద ఎత్తున​ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.. బాలయ్య చిల్లర వేషాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాలకృష్ణకు ముందే మెంటల్‌ అని.. ఆయనను అసెం‍బ్లీకి రానివ్వొద్దని స్పీకర్‌ని కోరారు.

సైకోలా వ్యవహరించే బాలకృష్ణ.. గన్ తీసుకువచ్చి ఎవరినైనా కాల్చినా కేసులు వుండవని.. పైగా ఆయనకు మెంటల్ సర్టిఫికెట్ వుందంటూ ఎద్దేవా చేశారు. కాలేజీలో అమ్మాయిలను చూసి పోకిరీలు విజిల్స్ వేసినట్లు.. అసెం‍బ్లీలో టీడీపీ నేతల ప్రవర్తన ఉందని మండిపడ్డారు. బాలకృష్ణ, ఆయన బావ చంద్రబాబు అసలైన సైకోలే కాదు పిచ్చోళ్లు కూడా అంటూ ఎమ్మెల్యే మధుసూదన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మీసాలు తిప్పడానికి, తొడలు కొట్టడానికి ఇదేమయినా సినిమానా అంటూ బాలకృష్ణ తీరుపై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే మధుసూదన్‌. అయినా ఈ తిప్పేదేదో తన తండ్రికి వెన్నపోటు పొడిచపుడు తిప్పితే బావుండేదంటూ బాలకృష్ణపై సెటైర్లు వేశారు. ఇప్పుడిలా అసెంబ్లీలో వీధి రౌడీలా ప్రవర్తించడం మంచిది కాదన్నారు. తన తండ్రి చావుకు కారణమైనోడి కళ్లలో ఆనందం చూసేందుకే బాలకృష్ణ ఇదంతా చేస్తున్నాడన్నారు. ముందు బాలయ్యని సభ నుంచి బయటకు తరలించి.. మెంటల్‌ హాస్పిటల్‌కి తరలించాలని సూచించారు వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş