Tirupathi Rao
Anchor Shyamala Comments: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. అధికార పార్టీ తాము చేసిన మంచిని చెప్పుకుంటూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. అధికార పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్తున్న యాంకర్ శ్యామలా తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Anchor Shyamala Comments: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. అధికార పార్టీ తాము చేసిన మంచిని చెప్పుకుంటూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. అధికార పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్తున్న యాంకర్ శ్యామలా తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Tirupathi Rao
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూర్యుడి వేడికంటే ఎన్నికల వేడే ఎక్కువగా ఉంది. అధికార పార్టీ, సీఎం జగన్ మంచి చేస్తేనే మాకు ఓటేయండి అని ప్రజల్లోకి వెళ్తుంటే.. ప్రతిపక్ష కూటమి మాత్రం అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ఓటర్లను మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. అభివృద్ధి మా అజెండా అంటూ జబ్బలు చరుచుకునే చంద్రబాబు కూడా సీఎం జగన్ ను ఓడించాలనే ఏకైక లక్ష్యంలో రాష్ట్ర ప్రజలపై వల్లమాలిన ప్రేమను కురిపించేస్తున్నారు. ఎక్కడలేని సంక్షేమం పథకాలను ప్రజలపై కుమ్మరించేస్తున్నారు. అధికారంలోకి వస్తే చాలు.. హామీలు నెరవేర్చకపోతే మలన్ని ఎవరు అడుగుతారు అనే తరహాలో వారి తీరు కనిపిస్తోంది. వారు చెప్పిన కల్లబొల్లి కబుర్లను రాష్ట్ర ప్రజలు కూడా నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా యాంకర్ శ్యామల ఇలాంటి వాళ్ల తీరును ఎండగడుతూ ఒక కుందేలు కథ చెప్పింది.
గతే ఎన్నికల సమయంలోనే వైసీపీ కండువా కప్పుకున్న యాంకర్ శ్యామలా అప్పటి నుంచి జగన్ కోసమే పని చేస్తోంది. తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ప్రజల్లోకి వెళ్తూ ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తున్నారు. తాజాగా ఐడ్రీమ్ మీడియాకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటరవ్యూలో ప్రతిపక్షాలను ఉద్దేశించి పరోక్షంగా కొన్ని చురకలు అంటించారు. వారికి దురుద్దేశం ప్రజలకు అర్థమయ్యేలా ఒక కుందేలు కథ కూడా చెప్పారు. “అనగనగా ఒక అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. దానికి వేటాడి శక్తి పోయింది. తనకు ఆహారం తెచ్చిపెట్టేందుకు.. తన ఉనికి చాటుకునేందుకు ఒక గుంటనక్క సాయాన్ని కోరింది.
ఆ ముసలి తోడేలుకు సహాయం చేయకపోతే తనని ఎక్కడ తినేస్తుందో అని ఆ ముసలి తోడేలు చెప్పిందల్లా చేసేందుకు ఆ గుంటన్నక సిద్ధమైపోయింది. అలా అడవిలో కనిపించిన ప్రతి జంతువుకు గుంటనక్క ఆ ముసలి తోడేలు గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. కొన్ని జంతువులు ఆ గుంటనక్క చెప్పిన మాటలను వింటున్నాయి. కానీ, కొన్ని తెలివైన జంతువులు మాత్రం ఆ గుంటనక్క మాటలను ప్టటించుకోలేదు. అలా ఆ గుంటనక్క ఒక కుందేలుకు మాయ మాటలు చెప్పి తోడేలు దగ్గరికి తీసుకెళ్లింది. ఆ ముసలి తోడేలు ఈ గుంటనక్క ఆ కుందేలుకు అన్నీ చేసేస్తాం.. అందంళం ఎక్కిస్తాం అంటూ కబుర్లు చెప్పాయి.
ముసలి తోడేలు, గుంటనక్క మాటలను నమ్మిన కుందేలు ఎన్నో ఊహించుకుంది. ఆ ముసలి తోడేలు ఆ కుందేలు చెవుల్ని కొరుక్కు తినేసింది. కంగారు పడిన కుందేలు వీళ్లు నాకు చెప్పింది ఒకటి ఇక్కడ జరుగుతోంది ఒకటి అని పారిపోయేందుకు ప్రయత్నించింది. అప్పుడు గుంటనక్క ఆ కుందేలుతో నీకు కిరీటం చేయిస్తున్నాం.. ఆ చెవులు అడ్డం కదా.. అందుకే తిసేశాం అని చెప్తుంది. నమ్మేసిన కుందేలు కిరీటం కోసం ఎదురుచూస్తోంది. ఈసారి ఆ ముసలి తోడేలు కుందేలు తోకను కొరికేస్తుంది. మళ్లీ పారిపోయేందుకు ప్రయత్నించగా.. ఈసారి నీ కోసం సిహాసనం చేయిస్తున్నాం.. ఆ తోక అడ్డం అని తీసేశాం అని చెప్పారు.
ఆ మాటలు కూడా నమ్మేసిన కుందేలు అక్కడే ఉండిపోయింది. ఆఖరికి ఆ ముసలి తోడేలు కుందేలు పీక కొరికేసింది. ఆ కుందేలును ముక్కలు చేస్తుండగా ఆ గుంటనక్క కుందేలు బుర్రను తినేస్తుంది. ఆ తోడేలు దాని బ్రెయిన్ ఏదని అడగ్గా.. అదే ఉంటే ఆ కుందేలు మన దగ్గరకు వచ్చేదా అంటూ గుంటనక్క అనగానే తోడేలు కూడా నవ్వేస్తుంది. ఇక్కడ ఆ ముసలి తోడేలు ఎవరు అని నేను అడగను. ఆ గుంటనక్క ఎవరో మీ ఆలోచనకే వదిలేస్తున్నాం. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒక్క నిమిషం ఆలోచించి ఓటు వేయండి” అంటూ యాంకర్ శ్యామలా చెప్పిన ఈ కుందేలు కథ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.