Dharani
Janasena Party: ఎన్నికల వేళ జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. కీలక నేత ఒకరు పార్టీకి రాజీనామా చేశారు. ఆవివరాలు..
Janasena Party: ఎన్నికల వేళ జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. కీలక నేత ఒకరు పార్టీకి రాజీనామా చేశారు. ఆవివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే అధికార పార్టీ.. ఎలక్షన్ ప్రచారంలో దూసుకుపోతుండగా.. విపక్ష కూటమి టీడీపీ, జనసేన మాత్రం ఇంకా వెనకబడే ఉన్నాయి. పొత్తుల మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఇంతకు బీజేపీ.. టీడీపీ-జనసేన కూటమితో కలుస్తుందా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. విపక్ష కూటమి నేతలు.. బీజేపీతో పొత్తు కోసం.. ఢిల్లీ వెళ్లి కాషాయ పార్టీ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. జనసేనకు కేటాయించిన నియోజకవర్గాల్లో.. ఇరు పార్టీల నేతల మధ్య విబేధాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలకు మందు జనసేనకు భారీ షాక్ తగిలింది. కీలక నేత ఒకరు రాజీనామా చేశారు. ఆ వివరాలు..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండగా.. జనసేనకు షాక్ తగిలింది. పొత్తులపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే.. పవన్ కళ్యాణ్‌కు భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీకి చెందిన కీలక నేత ఆ పార్టీ ఇంఛార్జి పదవికి రాజీనామా చేశారు. ఆయనే చీరాల జనసేన సమన్వయకర్త ఆమంచి స్వాములు. శుక్రవారం నాడు ఆయన తన పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు పంపించారు.
చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడే ఆమంచి స్వాములు. గతేడాది వరకు ఆయన వైసీపీలోనే ఉండేవారు. కానీ 2023లో అధికార పార్టీకి రాజీనామా చేసి.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరారు ఆమంచి స్వాములు. ఆ వెంటనే జనసేన అధిష్టానం ఆయనకు కీలక పదవిని అప్పగించింది. ఆమంచి స్వాములును జనసేన రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు పవన్ కళ్యాణ్. ఇక ఇటీవలే ఎన్నికలకు ముందు చీరాల జనసేన సమన్వయకర్తగానూ బాధ్యతలు అప్పగించారు.
అయితే టీడీపీతో పొత్తు, జనసేనకు టికెట్లు కేటాయింపు వంటి పరిణామాల నేపథ్యంలో స్వాములు గత కొంత కాలంగఅసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. గిద్దలూరు నుంచి ఆమంచి స్వాములు పోటీచేయాలని భావించారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేన కోఆర్డినేటర్ పదవికి ఆమంచి స్వాములు రాజీనామా చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే సమన్వయకర్త పదవికి రాజీనామా చేసినట్లు ఆమంచి స్వాములు తెలిపారు. జనసేన కార్యకర్తగా కొనసాగుతానని లేఖలో స్పష్టం చేశారు.
Amanchi swamulu resigned??? pic.twitter.com/jvUNK13Bbl
— Narendra JSP🔯🥛 (@Narendra4JSP) March 8, 2024