Dharani
Alla Ramakrishna Reddy: వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన ఆర్కే.. సరిగ్గా నెల రోజుల్లోనే తిరిగి సొంత గూటికి చేరుకున్నాడు. దీని వెనక గల కారణాలు మీకోసం
Alla Ramakrishna Reddy: వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన ఆర్కే.. సరిగ్గా నెల రోజుల్లోనే తిరిగి సొంత గూటికి చేరుకున్నాడు. దీని వెనక గల కారణాలు మీకోసం
Dharani
ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తన ధ్యేయం అన్న షర్మిల.. ఎన్నికల్లో కనీసం పోటీ కూడా చేయకుండా.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి కేడర్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఆ వెంటనే ఏపీకి తన రాజకీయ మకాం మార్చింది. ఏ పార్టీ అయితే తన అన్నను, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందో.. ఆ పార్టీ కాంగ్రెస్‌లో చేరింది షర్మిల. వైఎస్ అభిమానులు ఎవరూ దీన్ని జీర్ణించుకోలేకపోయారు.
ఇక షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. హస్తం పార్టీలోకి కొన్ని రోజుల పాటు వలసలు కొనసాగాయి. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. వైసీపీకి, ముఖ్యమంత్రి జగన్‌కు, వైఎస్సార్‌కు వీర విధేయుడిగా ఉండే ఆర్కే.. వ్యక్తిగత అసంతృప్తుల కారణంగా… పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. షర్మిలతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఏదో ఊహించుకుని కాంగ్రెస్‌లో చేరిన ఆర్కేకు నెల రోజుల్లోనే ఆ పార్టీ తీరు, షర్మిల వ్యవహారశైలి.. ఆమె స్వార్థపూరిత నిర్ణాయలు అర్థం కాసాగాయి. కాంగ్రెస్ ముసుగులో షర్మిల చంద్రబాబు నాయుడు, టీడీపీ ప్రయోజనాల కోసం పని చేస్తుందని అర్థం చేసుకున్నారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు ఆర్కే.
అందుకే కాంగ్రెస్‌లో చేరిన నెల రోజుల వ్యవధిలోనే.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి.. తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. నేడు అనగా మంగళవారం నాడు వైఎస్ జగన్‌ను కలిశారు. వైసీపీలోనే కొనసాగబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆర్కే వైసీపీని వీడి.. కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయన అనుచరులకు కూడా నచ్చలేదు. ఇక తాజాగా షర్మిల వైఖరి.. సీఎం జగన్‌పై ఆమె చేస్తోన్న ఆరోపణలు చూసిన తర్వాత.. ఆర్కే తన నిర్ణయంపై పశ్చాతాపం చెందారని సన్నిహితులు చెబుతున్నారు.
సొంత అన్నను జగన్ రెడ్డి అంటూ అవమానించడం.. చంద్రబాబును గారు అని గౌరవించడం వెనక షర్మిల స్వార్థపూరత ప్రయోజనాలను అర్థం చేసుకున్నారు ఆర్కే. దాంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దాంతో తిరిగి తన అధినేత జగన్ వెంటే నడవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని సీఎం జగన్‌కు వివరించడం కోసం మంగళవారం నాడు ఆయనను ప్రత్యేకంగా కలిశారు. ఇక మీదట తాను వైసీపీలోనే కొనసాగుతానని వెల్లడించారు. ఇక నెలలోపే కీలక నాయకుడు ఇలా కాంగ్రెస్‌ను వీడటం షర్మిలకు భారీ షాక్ అనే చెప్పవచ్చు. కానీ వైసీపీ శ్రేణులు, ఆర్కే అనుచరులు మాత్రం ఆయన నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆర్కే వైసీపీలో చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.