iDreamPost
android-app
ios-app

OTT News: ఈ నెలలో OTTలోకి వచ్చిన తెలుగు సినిమాలు! ఏమైనా మిస్ అయ్యారా?

  • Published Feb 26, 2024 | 4:57 PM Updated Updated Feb 26, 2024 | 4:57 PM

ఓటీటీ లకు ఆదరణ బాగా లభిస్తున్న క్రమంలో.. థియేటర్ లో సినిమాలు విడుదలైన నెల లోపే ఓటీటీ లో అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరిలో ఓటీటీ లో విడుదలైన సినిమాల జాబితా ఇలా ఉంది.

ఓటీటీ లకు ఆదరణ బాగా లభిస్తున్న క్రమంలో.. థియేటర్ లో సినిమాలు విడుదలైన నెల లోపే ఓటీటీ లో అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరిలో ఓటీటీ లో విడుదలైన సినిమాల జాబితా ఇలా ఉంది.

  • Published Feb 26, 2024 | 4:57 PMUpdated Feb 26, 2024 | 4:57 PM
OTT News: ఈ నెలలో OTTలోకి వచ్చిన తెలుగు సినిమాలు! ఏమైనా మిస్ అయ్యారా?

ఇపుడు ఓటీటీ లకు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. థియేటర్ లో విడుదలైన బడా హీరోల చిత్రాలైనా .. చిన్న చిత్రాలైనా నెల కూడా గడవకముందే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికి వరకు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో ఏ ఏ చిత్రాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయి అనే అప్ డేట్స్ తరచూ చూస్తూనే ఉన్నాము. ఓటీటీ లకు ఆదరణ బాగా పెరిగిపోవడంతో.. ఒక్క ఫిబ్రవరి లోనే అనేక సినిమాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ సినిమాలు ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే వివరాలు చూద్దాం.

సినిమా అంటే మిగతా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో తెలీదు కానీ, తెలుగువారికీ మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా .. ఓటీటీ లో స్ట్రీమింగ్ అయినా.. అది ఏ భాషకు సంబంధించింది అయినా సరే.. కథ బావుంటే ఆ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ తెచ్చిపెట్టేస్తారు. ఈ క్రమంలో సంక్రాంతి బరిలో పోటీ పడిన ఎన్నో చిత్రాలు కూడా ఓటీటీలో దూసుకుపోతున్నాయి.

1)సైంధవ్:
విక్టరీ వెంకటేష్ 75వ చిత్రంగా భారీ ప్రమోషన్స్ జరిగిన ఈ చిత్రం .. సంక్రాతి కానుకగా జనవరి 13న థియేటర్ లో విడుదలైంది. కానీ, విడుదల తర్వాత మాత్రం థియేటర్ ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక విడుదలైన నెల లోపే అంటే ఫిబ్రవరి 3నుంచి.. ఈ సినిమా “అమెజాన్ ప్రైమ్” ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ ప్రేక్షకులను ఈ సినిమా ఓ మేరకు ఆకట్టుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

2)గుంటూరు కారం:
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో .. భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్యన సంక్రాంతి కానుకగా “గుంటూరు కారం” సినిమా విడుదలైంది. మొదట ఈ సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకున్నా .. రోజులు గడిచే కొద్దీ .. ఫ్యామిలి ఆడియన్స్ నుంచి హిట్ టాక్ సంపాదించుకుని.. బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 9 నుంచి “నెట్ ఫ్లిక్స్” ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అంతే కాకుండా ఓటీటీ లో “గుంటూరు కారం” మంచి వ్యూవర్ షిప్ తో దూసుకుపోతోంది. పైగా నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోను స్ట్రీమింగ్ అవుతోంది.

3)నా సామిరంగ:
సంక్రాంతి బరిలో పోటీ పడిన చిత్రాలలో నాగార్జున నటించిన “నా సామి రంగ” కూడా ఒకటి. డైరెక్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద ఓ మాదిరి కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. ఓ రకంగా ఈ సినిమా థియేటర్ లో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని చెప్పి తీరాలి. దీనితో ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీ నుంచి “డిస్నీప్లస్ హాట్‍స్టార్” ఓటీటీలో స్ట్రీమింగ్‍ అవుతోంది.

4)బబుల్‍గమ్:
ప్రముఖ బుల్లి తెర యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల డెబ్యూ ఫిల్మ్ “బబుల్ గమ్”. సినిమా విడుదలకు ముందు ఉన్న అంచనాలను రిలీజ్ తర్వాత అందుకోలేకపోయింది. కానీ, డెబ్యూ ఫిల్మ్ అయినా కూడా .. రోషన్ తన 100% ఇవ్వడంతో ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 9 నుంచి “ఆహా” ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

5)భామాకలాపం 2:
ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన భామ కలాపం పార్ట్-1 కు దక్కిన క్రేజ్ తో .. ఇప్పుడు దానికి సిక్వెల్ గా “భామ కలాపం-2” ని చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా “ఆహ” ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో హైయెస్ట్ వ్యూవర్ షిప్ తో ట్రెండింగ్ లో ఉంది. ఫిబ్రవరి 16నుంచి ఈ చిత్రం ఆహ లో స్ట్రీమింగ్ అవుతోంది.

6)పిండం:
సినెమాలన్నిటిలో హర్రర్ చిత్రాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ సినిమా గత ఏడాది థియేటర్ లో రిలీజ్ అయ్యి.. పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇక ఫిబ్రవరి 2 నుంచి ఆహ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా “అమెజాన్ ప్రైమ్ వీడియో” లోను ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక వీటితో పాటు.. డబ్బింగ్ చిత్రాలలో తమిళ హీరో ధనుష్ నటించిన “కెప్టెన్ మిల్లర్”.. ఫిబ్రవరి 9నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, రియల్ లైఫ్ స్టోరీ అయిన “ది కేరళ స్టోరీ” చిత్రం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మమ్ముట్టి నటించిన మలైకొట్టై వాలిబన్ కూడా “డిస్నీ ప్లస్ హాట్‍స్టార్” లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. మరి, ఈ సినిమాలను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయి ఉంటే వెంటనే చూడాల్సిందే.మరి, ఈ సినిమాల ఓటీటీ అప్ డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.