వీక్ ఎండ్‌లో ఓటీటీలో వచ్చే ఈ టాప్ కొరియన్ మూవీస్‌పై ఓ లుక్కేయండి!

Korean Thriller Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ ఏలుతుంది. భాషతో సంబంధం లేకుండా వీక్ ఎండ్ వచ్చే సినిమాలు, వెబ్ సీరీస్ చూసి ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

Korean Thriller Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ ఏలుతుంది. భాషతో సంబంధం లేకుండా వీక్ ఎండ్ వచ్చే సినిమాలు, వెబ్ సీరీస్ చూసి ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఓటీటీ వచ్చిన తర్వాత వీక్ ఎండ్ లో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు చూస్తూ ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండ కంటెంట్ బాగుంట ఏలాంటి సినమా, వెబ్ సీరీస్ అయినా ఆదరిస్తున్నారు. కరోనా తర్వాత చాలా మంది ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. ఓటీటీలో చాలా వరకు క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ కొరియన్ మూవీస్ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. థ్రిల్లర్, డ్రామా, యాక్షన్ ఏ జోనర్ అయినా సరే కొరియన్ మూవీస్ బాగుంటాయని టాక్. మరి వీక్ ఎండ్ లో ఈ మూవీస్ పై ఓ లుక్కెయండి.

2003 లో వచ్చిన ‘మెమొరీస్ ఆప్ మర్డర్’ : ఈ మూవీ మిస్టీరియస్ హత్యకు సంబంధించింది. ఇద్దరు డిటెక్టీవ్స్ వరుస హత్యల గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు.. వాళ్ల ఆ కేసులు ఎలా సాల్వ్ చేశారన్నదే సినిమా. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

2003 లో వచ్చిన ‘ది క్లాసిక్’ మూవీ : అద్భుతమైన రొమాంటికి డ్రామా.. ఓ కాలేజ్ స్టూడెంట్ కి పాత డైరీ దొరుకుతుంది.. అందులో తన తల్లి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుంది.. ఆ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ముగింపు ఎలా ఉంటుంది అనేది సినిమా. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

2003 లో వచ్చిన ‘ఓల్డ్ బాయ్’మూవీ : ఇది కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. ఒక ఖైదీకి అన్ని వసతులు కల్పిస్తే..అనవసరంగా లేని పోని గొడవల్లో ఇరుక్కుపోతాడు. చివరికి ఆ గొడవలు ఎలా బయటపడతాడు అన్నదే సినిమా. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

2010లో రిలీజ్ అయిన ‘ఫర్గాటెస్ ’ మూవీ : మిస్టీరియస్ థ్రిల్లర్ గా అద్భుతంగా తీశారు. గతం మర్చిపోయిన ఓ వ్యక్తి. సొంత తమ్ముడిని కిడ్నాప్ చేసి దాచి ఉంచుతాడు.. చివరికి ఆ వ్యక్తి తమ్ముడిని ఏం చేస్తాడు అన్నదే సినిమా. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

2010లో వచ్చిన ‘ఐ సా ద డెవిల్’ మూవీ : యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఓ ఊరిలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలు ఎవరు చేస్తుంటారు? సీక్రెట్ ఏజెంట్ ఎలా కనిపెడతాడు అన్నదే సినిమా. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

2019 లో వచ్చిన ‘ద గ్యాంస్టర్ ద కాప్ ద డెవిల్’ మూవీ : ఇది ఫుల్ లెన్త్ యాక్షన్ మూవీ. ఓ సైకిన గ్యాంగ్ స్టర్ , పోలీసులు కలిసి ఎలా మట్టుపెట్టారు అన్నదే సినిమా స్టోరీ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

2016 లో వచ్చిన ‘ట్రెన్ టు బుసాన్’ మూవీ : ఇది ఓ హర్రర్ మూవీ, బుసాన్ అనే ఊరికి వెళ్లేందుకు ఓ వ్యక్తి తన కూతురితో కలిసి ట్రైన్ ఎక్కుతాడు. తర్వాత తెలుస్తుంది అతడు ఎక్కింది జాంబీలు ఉండే ట్రైన్ అని. వాళ్ల నుంచి తండ్రీ కూతరు ఎలా బయటపడతారు అన్నదే సినిమా.ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

2017 లో వచ్చిన ‘ద ఔట్ లాస్’ మూవీ : యాక్షన్ ఎంట్రటైన్ మెంట్ తా తెరకెక్కిన ఈ మూవీ కొరియన్, చైనీస్ గ్యాంగ్స్ మద్య వచ్చే గొడవ. ఓ లేడీ డిటెక్టీవ్ ఎలా పరిష్కరించింది అనేది సినిమా. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

2016లో వచ్చిన ‘మెయిన్ డెన్’ మూవీ : రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. 1930లో ఓ రాజ కుమారి వద్ద పనిచేయడానికి ఓ యువతి వెళ్తుంది. ఆ తర్వాత ఊహించని సంఘటన జరుగుతుంది. ఈ మూవీలో 18 ప్లస్ సన్నివేశాలు ఉన్నాయి.. పిల్లలతో చూసే సినిమా కాదు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

2019లె వచ్చిన ‘పారా సైట్’ మూవీ : ఆస్కార్ అవార్డు గెల్చుకున్న ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ ఒక నిరుపేద ఫ్యామిలీ, మాయ మాటలు చెప్పి కోటీశ్వరుల ఇంట్లో పనికి చేరుతారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెరపై చూడాల్సిందే. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

2014 లో వచ్చిన ‘ద అడ్మైరల్’ మూవీ : పిరియాడికల్ గా వచ్చిన ఈ మూవీ 13 యుద్ద నౌకలు ఉన్న ఒక యోధుడు.. 300 యుద్ద నౌకలు ఉన్న జపాన్ యోధులతో ఎలా పోరాడుతాడు అన్నదే స్టోరీ. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

2017 లో వచ్చిన ‘ ఏ ట్యాక్సీ డ్రైవర్’ మూవీ : కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీశారు. సాధారణ ట్యాక్సీ డ్రైవర్ ఊహించని వివాదాల్లో చిక్కుకొని చివరికి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడతాడు అన్నదే స్టోరీ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Show comments