iDreamPost

Satyabhama OTT: కాజల్ సత్య భామ మూవీ స్ట్రీమ్ అయ్యేది ఆ OTTలోనే!

  • Published Jun 08, 2024 | 5:02 PMUpdated Jun 08, 2024 | 5:02 PM

థియేటర్ లో సినిమాలు లేవు అనుకునే టైమ్ కి కొన్ని కొత్త సినిమాలు ఎంట్రీ ఇచ్చేశాయి. ఇక అలా సినిమాలు ఓటీటీ లోకి వచ్చాయంటే అవి ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తాయా అని ఆరా తీస్తుంటారు ప్రేక్షకులు. ఇప్పుడు తాజాగా వచ్చిన సినిమాకు సంబంధించి కూడా ఇలాంటి బజ్ ఏ వినిపిస్తుంది.

థియేటర్ లో సినిమాలు లేవు అనుకునే టైమ్ కి కొన్ని కొత్త సినిమాలు ఎంట్రీ ఇచ్చేశాయి. ఇక అలా సినిమాలు ఓటీటీ లోకి వచ్చాయంటే అవి ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తాయా అని ఆరా తీస్తుంటారు ప్రేక్షకులు. ఇప్పుడు తాజాగా వచ్చిన సినిమాకు సంబంధించి కూడా ఇలాంటి బజ్ ఏ వినిపిస్తుంది.

  • Published Jun 08, 2024 | 5:02 PMUpdated Jun 08, 2024 | 5:02 PM
Satyabhama OTT: కాజల్ సత్య భామ మూవీ స్ట్రీమ్ అయ్యేది ఆ OTTలోనే!

ఇప్పుడు ఓటీటీ సినిమాలకు ఏ రేంజ్ లో ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజుల తర్వాత ఆయా సినిమాలు ఏ ఓటీటీ లోకి వస్తున్నాయి. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అనే టాక్ వినిపించేది. దానికి ప్రేక్షకులు ఆశ్చర్యపోయేవారు. కానీ ఇప్పుడు థియేటర్ లో ఆయా సినిమాలు రిలీజ్ అయిన వెంటనే వాటి స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ కన్ఫర్మ్ అయిపోయి.. అవి ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతాయి అనే అంచనాలు కూడా స్టార్ట్ అయిపోయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అంతే.. తాజాగా కాజల్ నటించిన సత్య భామ సినిమా జూన్ 7 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్ డేట్ వచ్చేసింది.

చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత కాజల్ .. సత్య భామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది కూడా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ కావడంతో.. అందరూ ఈ సినిమాపై బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అనుకున్న విధంగానే ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. తొలి రోజు ఈ సినిమా కోటికి పైగా గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో కాజల్ తో పాటు.. న‌వీన్‌చంద్ర‌, ప్ర‌కాష్‌రాజ్, ప్ర‌జ్వ‌ల్ యాద్మ ముఖ్య పాత్రలు పోషించారు. క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ క‌థ‌కు హ్యూమ‌న్ ట్రాఫికింగ్‌, టెర్ర‌రిజం ఇలాంటి ఎన్నో అంశాలను ఈ సినిమాలో చూపించారు మేకర్స్. ప్రస్తుతానికి ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గానే రన్ అవుతుంది. ఇక అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ బజ్ కూడా వచ్చేసింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా సొంతం చేసుకుంది.

ఇక ఓటీటీ రూల్స్ ప్రకారం.. థియేటర్ లో రిలీజ్ అయినా ఏ సినిమా అయినా కూడా.. ఓటీటీ లోకి రావడానికి నెల రోజుల సమయం పడుతుంది. లేదా థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని.. ఇంకాస్త ముందు రావడమో లేదా కాస్త ఆలస్యంగా రావడమో జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఓటీటీ రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ లేదు. ఇక సత్య భామ కథ విషయానికొస్తే.. కాజల్ అగర్వాల్ షీ టీమ్ లో ఏసీపీగా పనిచేస్తుంటుంది. ఈ క్రమంలో.. హసీనా అనే యువతిని ఆమె భర్త యాదు దారుణంగా హత్య చేస్తాడు. ఆ మర్డర్ తర్వాత యాదు తో పాటు.. హసీనా తమ్ముడు ఇక్బల్ కూడా కనిపించకుండా పోతాడు. ఈ మిస్టరీ కేసును ఛేదించే క్రమంలో కాజల్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయి! అసలు హసీనా ఎలా చనిపోయింది ! కాజల్ ఈ కేసును ఎలా సాల్వ్ చేసింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి