Swetha
Jailer Movie Web Series In OTT: జైలర్ మూవీ రజిని కాంత్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాపై.. ఓ స్పెషల్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందనే విషయాలను చూసేద్దాం.
Jailer Movie Web Series In OTT: జైలర్ మూవీ రజిని కాంత్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాపై.. ఓ స్పెషల్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందనే విషయాలను చూసేద్దాం.
Swetha
అప్పటివరకు వరుస ఫెయిల్యూర్స్ తో ఉన్న రజిని కాంత్ ను.. ఒక్కసారిగా సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా ‘జైలర్’. ఈ ఒక్క సినిమా వింటేజ్ రజిని కాంత్ పవర్ ఏంటో మళ్ళీ అందరికి తెలిసేలా చేసింది. కేవలం రజిని కాంత్ కు హిట్ ఇవ్వడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ను రాబట్టింది ఈ మూవీ. ఇక త్వరలోనే ఈ మూవీ సిక్వెల్ కు సంబంధించిన అప్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు ఈ మూవీ టాపిక్ ఎందుకొచ్చిందంటే.. తాజాగా ఈ మూవీపై ఓ స్పెషల్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ ను రూపొందించారు. మరి ఈ వెబ్ సిరీస్ ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందనే విషయాలను చూసేద్దాం.
సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్.. పేరు “జైలర్ అన్ లాక్డ్”. ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా శుక్రువారం నుంచి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మొత్తం మూడు ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. కాగా ఈ సిరీస్ లో జైలర్ మూవీకి సంబంధిచిన విశేషాలు, మూవీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ , మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో పాటు.. మిగిలిన టెక్నీషియన్స్ అందరూ కూడా.. ఈ మూవీ తీసేటప్పుడు వారికి ఎదురైన అనుభవాలను.. ఈ డాక్యుమెంటరీ సిరీస్ లో చూపించారు. ఈ సిరీస్ ప్రస్తుతం సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక డైరెక్టర్స్ , టెక్నీషియన్స్ ఇంటర్వూస్ మాత్రమే కాకుండా.. ఈ మూవీలో మిగిలిన స్టార్ హీరోలైన మోహన్ లాల్ , శివ రాజ్ కుమార్ లను గెస్ట్ రోల్స్ ను ఒప్పించడం కోసం.. ఎలాంటి ప్రయత్నాలు చేశారు. వీరికి బదులుగా ఇంకా ఎవరెవరిని ఆ పాత్రల కోసం ముందుగా పరిశీలించారు అనే విషయాలను కూడా ఈ డాక్యుమెంటరీ ద్వారా బయటపెట్టినంటూ సమాచారం. ఇవి మాత్రమే కాకుండా జైలర్ మూవీ మేకింగ్ సీన్స్ , యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించిన విధానం.. లాంటి ఎన్నో విషయాలను ఈ సిరీస్ లో చూపించారు. సాధారణంగా తెర వెనుక ఏం జరిగింది అనే విషయాలను తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాంటి ఓ ప్రయత్నమే ‘జైలర్ అన్ లాక్డ్’ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.