Radhamadhavam OTT: పరువు కోసం కన్నకూతుర్నే.. OTTలోకి బెస్ట్ పిరియాడికల్ డ్రామా!

Radhamadhavam OTT: పరువు కోసం కన్నకూతుర్నే.. OTTలోకి బెస్ట్ పిరియాడికల్ డ్రామా!

కొన్ని సినిమాలు సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపోతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

కొన్ని సినిమాలు సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపోతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

తెలుగు సినిమాలకు ఇప్పుడు క్రేజ్ బాగానే పెరుగుతుంది. అందులోను ఓటీటీ లో ఇంకాస్త ఎక్కువే ఉంటుందని చెప్పి తీరాలి. ఈ వారం ఏ ఏ సినిమాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయనే లిస్ట్ ఆల్రెడీ చూసేసి ఉంటారు. వాటిలో ఈ వారం చూడదగిన సినిమాలు కేవలం కొన్ని మాత్రమే ఉండడంతో.. మూవీ లవర్స్ కాస్త నిరాశ చెందారు. కానీ, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపోతుంది. కాబట్టి ఈ వీకెండ్ ఎంటర్టైన్ చేయడానికి.. మరొక సినిమా రెడీ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

పరువు హత్యల నేపథ్యంలో.. ఇప్పటివరకు చాలానే సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం కాస్త డిఫ్ఫరెంట్ అని చెప్పి తీరాలి. ఈ సినిమా పేరు రాధామాధవం. ఈ సినిమాలో వినాయ‌క్ దేశాయ్‌, అప‌ర్ణ దేవి హీరో హీరోయిన్స్ గా నటించారు. మార్చి 1 న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. దాదాపు ఈ సినిమాలో అందరు కొత్త నటి నటులే నటించారు. పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో ఓ విలేజ్ లో లవ్ స్టోరీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. చిన్న సినిమా, కొత్త నటి నటులు కావడంతో ఈ సినిమా థియేటర్ లో ప్రేక్షకులనైతే అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎటువంటి అనౌన్సమెంట్ లేకుండా సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిపోతుంది. మరి ఓటీటీ ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఇక రాధామాధవం సినిమా కథ విషయానికొస్తే.. రాధ మాధవ అనే పేరుతో ఓ కేర్ సెంటర్ ను రన్ చేస్తూ ఉంటుంది. అనాధలకు, పిల్లలకు సేవ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అనుకోకుండా ఓసారి.. ఆ కేర్ సెంటర్ కు జైలు నుంచి తప్పించుకున్న వీరభద్రం అనే ఓ వ్యక్తి చేరుతాడు. అయితే అతను అక్కడ చేరిన తర్వాత.. ఆ కేర్ సెంటర్ నడుపుతున్నది.. తన కూతురు రాధే అని తెలుస్తుంది. అసలు వీరభద్రం ఎందుకు జైలుకు వెళ్తాడు ! రాధా ఆ కేర్ సెంటర్ కు మాధవ్ అని ఎందుకు పేరు పెట్టింది ! మాధవ్ కోసం రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంది ! అసలు ఆ తర్వాత ఏం జరిగింది ! ఈ కథ ఎలా ముందుకు సాగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments