iDreamPost
android-app
ios-app

OTT వీకెండ్ సజీషన్.. వీటిని అస్సలు మిస్ కాకండి..!

OTT Weekend Suggestions Don't Miss These 4 Movies: వీకెండ్ అంటే కచ్చితంగా ఓటీటీ మూవీస్ చూడాల్సిందే. అలాంటి అలవాటు ఉన్న వారికోసం ఈ వారం అదిరిపోయే సినిమాలు తీసుకొచ్చాం. ఒక్కో మూవీ మిమ్మల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తాయి.

OTT Weekend Suggestions Don't Miss These 4 Movies: వీకెండ్ అంటే కచ్చితంగా ఓటీటీ మూవీస్ చూడాల్సిందే. అలాంటి అలవాటు ఉన్న వారికోసం ఈ వారం అదిరిపోయే సినిమాలు తీసుకొచ్చాం. ఒక్కో మూవీ మిమ్మల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తాయి.

OTT వీకెండ్ సజీషన్.. వీటిని అస్సలు మిస్ కాకండి..!

వీకెండ్ వచ్చేస్తోంది అంటే.. ఓటీటీ లవర్స్ అంతా అలర్ట్ అయిపోతారు. ఎక్కడ ఓ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది అని వెతుకులాట స్టార్ట్ చేస్తారు. ఒక్కోసారి వీకెండ్ ని మూవీ నైట్ గా మార్చేస్తారు. అయితే అలా చేయాలి అంటే ముందు ఏ ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతోందో తెలియాలి. అలాగే ఏ సినిమా చూడాలో ఫిక్స్ అవ్వాలి. ఇదంతా చేయాలి అంటే మీరు ఇప్పటికే ఫిక్స్ అయిపోవాలి. ఇదంతా ఎందుకు అనుకుంటే మేము చెప్పే ఈ సజీషన్ ని ఫాలో అయితే మీ వీకెండ్ ని మంచి మూవీ వీకెండ్ గా మార్చుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. మరి.. అంత బాగా ఉన్న సినిమాలు ఏంటి? అస్సలు మిస్ కాకూడదు అనే పాయింట్ ఏంటో చూద్దాం.

ఇప్పుడు ఓటీటీలో బాగా వినిపిస్తున్న పేరు మహారాజ. థియేటర్లలో విజయ్ సేతుపతి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు తెలుగు ఓటీటీలోకి వచ్చేసింది. మరి.. అలాంటి సినిమాని ఎలా మిస్ అవుతారు చెప్పండి. విజయ్ సేతుపతి కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ ఇది టాక్ కూడా వచ్చింది. నిజానికి ఈ మూవీని థియేటర్లో చూడాల్సింది. కానీ, మీరు మిస్ అయితే మాత్రం కచ్చితంగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయండి.  అది ఈ వీకెండ్ కి బెస్ట్ పిక్ అవుతుంది. ఆ తర్వాత జెనీలియా భర్త చేసిన ఒక హారర్ కామెడీ చిత్రం ఉంది. అది కకూడ అనే మూవీ. ఇది కూడా జులై 12న ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ కి ఇది మంచి హారర్ కామెడీ చిత్రం అవుతంది.

ఇంక లవ్ స్టోరీస్ కోరుకునే వారికి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఉంది. పైగా ఇందులో కామెడీ బోనస్ అని చెప్పాలి. ఆ చిత్రం పేరు జిలేబి. ఇది 2023లో వచ్చిన చిత్రం. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదంతా ఒక అమ్మాయి.. బాయ్స్ హాస్టలో ఇరుక్కుపోతే ఏలా ఉంటుంది అనే పాయింట్ మీద నడుస్తూ ఉంటుంది. అయితే చిత్రంలో కావాల్సినంత మంది కమెడియన్స్ ఉన్నారు. వాళ్లు పండించే కామెడీకి మీకు పొట్ట చెక్కలవుతుంది.

ముఖ్యంగా అంతా మీరు రోజూ చూసే బుల్లితెర, సోషల్ మీడియాకి చెందిన వాళ్లే. ఆహాలో అందుబాటులో ఉంది. అయితే మరీ ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా.. జస్ట్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్. ఇంక ప్లాట్ అనే ఇంకో సినిమా కూడా ఉంది. ఇది ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు ఈ సినిమాని కూడా కచ్చితంగా ఈ వీకెండ్ కి ట్రై చేయచ్చు. ఇందతా ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా. ఎవరు మోసం చేశారు? ఎవరు హత్య చేశారు? అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవాలి అనే కుతూహలం బాగా ఉంటుంది. మరి.. ఈ వీకెండ్ ఈ సినిమాలను ట్రై చేయండి ఎంటర్ టైన్ అవ్వండి. ఇంక బోనస్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అగ్నిసాక్షి వెబ్ సిరీస్ కూడా చూసేయచ్చు. మొత్తం 4 ఎపిసోడ్స్ ఉన్నాయి.

 

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş