iDreamPost
android-app
ios-app

OTTలో వింత ప్రేమకథ! అచ్చం 7/G బృందావన కాలనిలా!

OTT Suggestions- Must Watch Love Story: మీరు తెలుగులో చాలానే ప్రేమకథలు చూసుంటారు. కానీ, హాలీవుడ్ లో లవ్ స్టోరీలు చూశారా? కానీ, ఈ మూవీని మాత్రం తప్పకుండా చూసేయండి.

OTT Suggestions- Must Watch Love Story: మీరు తెలుగులో చాలానే ప్రేమకథలు చూసుంటారు. కానీ, హాలీవుడ్ లో లవ్ స్టోరీలు చూశారా? కానీ, ఈ మూవీని మాత్రం తప్పకుండా చూసేయండి.

OTTలో వింత ప్రేమకథ! అచ్చం 7/G  బృందావన  కాలనిలా!

ప్రేమకథలు అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. కానీ, ఇప్పటి వరకు మీరు చాలానే లవ్ స్టోరీస్ చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక ప్రేమకథను మాత్రం చూసి ఉండరు. ఎందుకంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి దూరంగా ఉండటం అంటే ఎంత నరకమో అందరికీ తెలుసు. కానీ, అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేదే ఇక్కేడ ప్రశ్న. ఒక వస్తువు మన దగ్గర ఉంటే దాని విలువ మనకు తెలియదు అంటారు. కానీ, ఆ వస్తువు మన దగ్గర లేనప్పుడే మనకి దాని విలువ తెలుస్తుంది. అదే సామెత ప్రేమ విషయంలో కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అలాంటి ఒక విషయాన్ని కాస్త బలంగా చెప్పేదే ఈ మూవీ.

మీరు చూసిన అన్నీ లవ్ స్టోరీలకు ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది హాలీవుడ్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ కాబట్టి. అలాగని దీనిని తీసేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాక్షన్ లోనే కాదు.. ఎమోషన్ లో కూడా హాలీవుడ్ డైరెక్టర్లు ఆరితేరిపోయారు. ఆ విషయం ఇలాంటి సినిమాలు చూసినప్పుడే అర్థమవుతుంది. అన్నీ మూవీస్ లో లాగానే ఒక ప్రియుడు ఉంటాడు. కానీ, అతనికి ప్రియురాళ్లే ఎక్కువగా ఉంటారు. తాను ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. ఆమెతో ఎంతో ఆనందంగా ఉంటాడు. వాళ్లు శారీ*రకంగా కూడా దగ్గరవుతారు. వారిని ఎవ్వరూ విడదీయలేరు అనుకునే సమయంలో అతని ప్రవర్తనే అతనికి తన ప్రేయసిని దూరం చేస్తుంది.

ఈ ఇద్దరికీ ఎమోషన్స్ బాగా ఎక్కువ. ప్రేమ, కోపం, బాధ, ఆవేదన ఇలా అన్నీ ఎక్కువగానే ఉంటాయి. అన్నీ ఎక్స్ ట్రీమ్ లో ఉంటాయి. లైఫ్ అంతా బాగానే సాగుతున్న సమయంలో హీరో చేసిన పనికి హీరోయిన్ దూరమవుతుంది. ఇంక నీ లైఫ్ లో నేను ఉండను అని తెగేసి చెప్తుంది. ఆ తర్వతా హీరో లైఫ్ అగమ్యగోచరంగా మారిపోతుంది. ఈ కథను స్టార్ట్ చేయడం కూడా కాస్త భిన్నంగానే స్టార్ట్ చేశారు. తన దగ్గరలేని తన ప్రియురాలు తనతోనే ఉన్నట్లు ఊహించుకుంటూ హీరో ఉంటాడు. అలాగే తన కథను కూడా ప్రేక్షకులకు అలాగే చెప్పడం స్టార్ట్ చేస్తాడు. తన ఊహజనిత ప్రేయసిని చూపించి.. తన ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటాడు. ఈ సినిమా పేరు “ఆఫ్టర్ వి కొలైడెడ్”. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది కాస్త బో*ల్డ్ గా కూడా ఉంటుంది. అంటే హీరో- హీరోయిన్ మధ్య కొన్ని అలాంటి సీన్స్ ఉంటాయి. అందుకే కాస్త ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తే కాస్త బెటర్ గా ఉంటుంది.