iDreamPost
android-app
ios-app

Best Series: 13 మంది 2 వారాలు గుహలోనే.. ప్రాణాల కోసం చేసే పోరాటం!

OTT Suggestions- Real Life Rescue Series: మంజుమ్మెల్ బాయ్స్ చూసి అంతా వామ్మో అన్నారు. అందులో ఒక వ్యక్తి మాత్రమే గుహలో చిక్కుకుంటాడు. కానీ, ఈ సిరీస్ లో ఏకంగా 13 మంది గుహలో చిక్కుకుంటారు. వారిని ఎలా కాపాడారు? ఎంతమంది సురక్షితంగా బయట పడ్డారు అనేదే సిరీస్.

OTT Suggestions- Real Life Rescue Series: మంజుమ్మెల్ బాయ్స్ చూసి అంతా వామ్మో అన్నారు. అందులో ఒక వ్యక్తి మాత్రమే గుహలో చిక్కుకుంటాడు. కానీ, ఈ సిరీస్ లో ఏకంగా 13 మంది గుహలో చిక్కుకుంటారు. వారిని ఎలా కాపాడారు? ఎంతమంది సురక్షితంగా బయట పడ్డారు అనేదే సిరీస్.

Best Series: 13 మంది 2 వారాలు గుహలోనే.. ప్రాణాల కోసం చేసే పోరాటం!

మీరు ఇప్పటివరకు చాలానే సర్వైవింగ్ సినిమాలు చూసే ఉంటారు. ఒక్కోసారి రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనలు కూడా చూసుంటారు. ఈ మధ్య బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అంటూ సినిమాలు, సిరీస్లు తీసుకొస్తున్నారు. అలాంటిదే మంజుమ్మెల్ బాయ్స్ సినిమా కూడా. యదార్థ ఘటనల ఆధారంగా ఆ సినిమాని తెరకెక్కించి సూపర్ సక్సెస్ అయ్యారు. అయితే ఆ మూవీకి మించిన ఒక యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఒకటి ఉందని తెలుసా? ఆ సిరీస్ లో ఏకంగా 13 మంది ఒక గుహలో రెండు వారాల పాటు చిక్కుకుంటారు. వారిని ఎలా కాపాడారు అనే నేపథ్యంలోనే ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు.

నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇప్పటికే యదార్థ ఘటనల ఆధారంగా పలు సిరీస్లు, డాక్యుమెంటరీలు నిర్మించింది. అందులో భాగంగా నిర్మించిదే ఈ వెబ్ సిరీస్ కూడా. 2018లో ఉత్తర థాయ్ ల్యాండ్ లోని థామ్ లాంగ్ నాంగ్ నన్ అనే గుహలో ఏకంగా 12 మంది విద్యార్థుల ఫుట్ బాల్ టీమ్, వారి అసిస్టెంట్ కోచ్ చిక్కుకుంటారు. వాళ్ల వయసు కేవలం 11 నుంచి 16 మధ్యే ఉంటుంది. ఆ అసిస్టెంట్ కోచ్ వయసు 25 ఉంటుంది. వాళ్లు ఆ గుహను చూసేందుకు వెళ్లి అక్కడే చిక్కుకుంటారు. పిల్లలంతా గుహలో ఉండగా.. థాయ్ ల్యాండ్ లో ఆకస్మిక వరదలు వస్తాయి. ఆ వరద నీళ్లు గుహలోకి వెళ్లడంతో అంతా లోపల చిక్కుకుంటారు.

గుహలో చిక్కుకున్న పిల్లలను కాపాడేందుకు ఏకంగా 2 వారాల సమయం పడుతుంది. ఈ ఘటన 2018 జూన్- జులైలో జరిగింది. వారిని కాపాడేందుకు ఎంత కష్ట పడ్డారు? అసలు అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆ సమయంలో వారికి ఎదురైన సమస్యలు ఏంటి? ఆ సమయంలో వాతావరణం ఎంత ఇబ్బంది పెట్టింది? అసలు వాళ్లు ఎలాంటి టెక్నాలజీ వాడారు? 18 రోజులు ఆ గుహలోనే పిల్లలు ఎలా ధైర్యంగా ఉన్నారు? వారిని అంత బలంగా మార్చిన శక్తి ఏంటి? ఇలాంటి ఎన్నో భావోద్వేగ భరిత ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ లిమిటెడ్ సిరీస్ ని నిర్మించింది. నిజానికి దీనిని ఒక డాక్యుమెటరీలా తీయాల్సింది. కానీ, ఆ లైవ్ ఫుటేజ్ అంతా నెట్టింట అందుబాటులో ఉండటంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒక సిరీస్ ని నిర్మించినట్లు ఉంది.

ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పిల్లలు ఎవరూ చనిపోలేదు. కానీ, రెస్క్యూ సిబ్బంది మాత్రం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు కాపాడే క్రమంలో.. మరొకరు ఆస్పత్రిలో చేరిన తర్వాత మరణించారు. ఈ మొత్తం ఘటనను ఒక ఎమోషనల్ వేలో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒక 6 ఎపిసోడ్ల సిరీస్ గా తీసుకొచ్చింది. దాని పేరు “థాయ్ కేవ్ రెస్క్యూ”. 2022 నుంచే ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. కానీ, చాలామందికి తెలియలేదు. ఇప్పుడు మంజుమ్మెల్ బాయ్స్ ఎఫెక్ట్ వల్ల ఇలాంటి సిరీస్లు, సినిమాలు పెద్దఎత్తున సజీషన్ లోకి వస్తున్నాయి. ఈ సిరీస్ మొత్తం కూడా ఎంతో ఎమోషనల్ గా ఉంటుంది. ఒక్కో సీన్ కి కన్నీళ్లు కూడా వస్తాయి. కాకోపోతే ఆ విద్యార్థులు చూపించిన తెగింపు ఎంతో మదికి స్ఫూర్తిని అందిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి