Tirupathi Rao
OTT Suggestions- Jennifer Lopez Best Action Thriller: మీకు యాక్షన్ థ్రిల్లర్స్ అంటే ఇష్టమా? బెస్ట్ యాక్షన్ మూవీ ఒకటి ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీని మీరు చూస్తే బుర్ర గిర్రున తిరిగిపోతుంది. ఎందుకంటే ఓ రేంజ్ యాక్షన్ ఉండే ఫ్యూచరిస్టిక్ మూవీ ఇది.
OTT Suggestions- Jennifer Lopez Best Action Thriller: మీకు యాక్షన్ థ్రిల్లర్స్ అంటే ఇష్టమా? బెస్ట్ యాక్షన్ మూవీ ఒకటి ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీని మీరు చూస్తే బుర్ర గిర్రున తిరిగిపోతుంది. ఎందుకంటే ఓ రేంజ్ యాక్షన్ ఉండే ఫ్యూచరిస్టిక్ మూవీ ఇది.
Tirupathi Rao
హాలీవుడ్ సినిమా అంటే కచ్చితంగా గూస్ బంప్స్ యాక్షన్ సీక్వెన్స్ పక్కా ఉంటాయి. అలాగని అన్నీ సినిమాలు సూపర్ ఉంటాయని చెప్పడానికి లేదు. కానీ, ఇప్పుడు ఒక మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఒక్కో సీన్ కు మీకు కచ్చితంగా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సైంటిఫిక్ ఫ్యూచరిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ మూవీ ఒక జాక్ పాట్ లాంటిది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ తో ఆడియన్స్ మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు అధికారికంగా స్ట్రీమింగ్ స్టార్ట్ చేసేసింది. ఇప్పటికే రెస్పాన్స్ ఓ రేంజ్ లో వస్తోంది. కానీ, తెలుగు ప్రేక్షకులు ఇంకా ఈ మూవీని చూడటం స్టార్ట్ చేసినట్లుగా లేరు. ప్రస్తుతానికి ఇది ఓటీటీని ఊపేస్తోంది.
ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ సంస్థ ఫుల్ ఫామ్ లో ఉంది. అదిరిపోయే వెబ్ సిరీస్లు, సూపర్ డూపర్ యాక్షన్ చిత్రాలను విడుదల చేస్తూ ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్ టైన్ చేస్తోంది. దానిలో భాగంగానే తాజాగా ఒక సైఫై యాక్షన్ థ్రిల్లర్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. గుడ్ న్యూస్ ఏంటంటే.. అది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఆ మూవీలో జెన్నీఫర్ లోపెజ్ లీడ్ రోల్ ప్లే చేసింది. మీరు ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ గురించి ఎంత ఎక్స్ పెక్ట్ చేసినా కూడా.. అంతకు మించే ఉంటుంది గానీ తగ్గదు. ఇప్పటికే ట్రైలర్ చూస్తే మీకు ఆ విషయం అర్థమైపోతుంది.
ఇది మొత్తం సైంటిఫిక్, ఫ్యూచరిస్టిక్ వర్షన్ లో ఉంటుంది. మనిషి తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. మానవాళికే ముప్పుగా మారితే ఏంటి పరిస్థితి అనే పాయింట్ మీద ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో రోబోలు, పెద్ద పెద్ద భవనాలు, ఫ్యూచర్ వెహికల్స్, విధ్వంసాలు ఇలా అన్నీ ఓ రేంజ్ లో ఉంటాయి. అలాగే కథ, కథనం మీద కూడా బాగానే దృష్టి పెట్టారు. అంతేకాకుండా ఇందులో జెన్నీఫర్ లోపెజ్, సీమూ లియూ యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టేశారు. ఇందులో స్మిత్ అనే ఒక ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఉంటుంది. హీరోయిన్ కు ఆ కంప్యూటర్ కు మద్య ఎక్కువ సంభాషణలు ఉంటాయి.
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబో కల్కి 2898 ఏడీ సినిమాలో కూడా ప్రభాస్.. బుజ్జి అనే రోబోతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. తాజాగా బుజ్జిని ప్రేక్షకులకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో కూడా అలాంటి పాయింటే ఉంది. ఈ సినిమా పేరు ‘అట్లాస్’. ఇది నెట్ ఫ్లిక్స్ లో మే 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఫుల్ ఆఫ్ యాక్షన్ కోరుకునే వారికి ఈ సినిమా ఎంతో బాగా నచ్చేస్తుంది. ఇప్పటికే ఈ అట్లాస్ ని చూసేసుంటే.. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.