Swetha
OTT Best Anthology Series Manorangathal In Telugu: ఓటీటీ లోకి వచ్చే స్ట్రెయిట్ సినిమాలకు ,సిరీస్ లకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో.. ఆంథాలజీ సిరీస్ లకు కూడా అదే క్రేజ్ లభిస్తుంది. ఈ క్రమంలో మలయాళ సూపర్ స్టార్స్ తో 9 కథలకు రూపొందించిన ఈ సిరీస్ ను కానీ.. మీరు మిస్ అయ్యారేమో ఓసారి చెక్ చేసేయండి.
OTT Best Anthology Series Manorangathal In Telugu: ఓటీటీ లోకి వచ్చే స్ట్రెయిట్ సినిమాలకు ,సిరీస్ లకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో.. ఆంథాలజీ సిరీస్ లకు కూడా అదే క్రేజ్ లభిస్తుంది. ఈ క్రమంలో మలయాళ సూపర్ స్టార్స్ తో 9 కథలకు రూపొందించిన ఈ సిరీస్ ను కానీ.. మీరు మిస్ అయ్యారేమో ఓసారి చెక్ చేసేయండి.
Swetha
సాధారణంగా ఓటీటీ లోకి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే.. అసలు మిస్ కాకుండా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. అందులోను తెలుగు సినిమాలంటే మరింత ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య స్ట్రెయిట్ సినిమాలను , సిరీస్ లను ఏ విధంగా ఆదరిస్తున్నారో . ఆంథాలజీ సిరీస్ లకు కూడా అదే రేంజ్ లో క్రేజ్ లభిస్తుంది. ఈ క్రమంలో రీసెంట్ గా మలయాళ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టి , ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్స్ కలిసి నటించిన మనోరంగతల్ సిరీస్ రిలీజ్ అయింది. ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మరి ఈ సిరీస్ ను మీరు చూశారో లేదో..ఈ సిరీస్ ఎలా ఉందో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో..ఓసారి చెక్ చేసేయండి.
ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. ఈ సిరీస్ లో మొత్తం తొమ్మిది కథలు ఉంటాయి. అందులో మొదటిది ఓలవుమ్ తీరవుమ్.. మోహన్ లాల్ తన ఫ్రెండ్ చెల్లి నభిషతో ప్రేమలో పడతాడు. కానీ ఆమె తల్లి ఆమెను కుంజలి అనే ధనవంతుడికి ఇచ్చి పెళ్ళి చేయాలని అనుకుంటుంది. ఈ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి అనేది మొదటి కథ. ఇక రెండవ కథ కడుగన్నావా.. తన చెల్లి కోసం ముమ్ముట్టి చేసే ప్రయాణమే ఈ కథ. ఈ కథకు రంజిత్ దర్శకత్వం వహించారు. మూడవ కథ కజ్ చా.. భర్తతో మనస్పర్థలు కారణంగా పుట్టింటికి వచ్చేసిన మహిళ.. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనేది ఈ కథ. నాల్గవ కథ విషయానికొస్తే.. శిలాలిఖితం.. రోజులు గడిచే కొద్దీ పల్లెటూరి ప్రజలలో కూడా ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అనేది ఈ కథలో చూపించారు. బిజూ మీనన్ ఈ కథలో మెయిన్ లీడ్ లో నటించారు.
ఇక ఐదవ కథ విల్పనా.. మధుబాల, ఆసిఫ్ నటించిన ఈ కథలో.. మానవ సంబంధాలు వాటి విలువల గురించి చాటి చెప్పారు. చాలా ఎమోషనల్ గా సాగిపోయే ఎపిసోడ్ ఇది. ఆరవ కథ షెర్లాక్.. పని కోసం సొంత ఊరిని విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించే కథ ఇది. ఇక ఏడవ కథ విషయానికొస్తే.. కాదళక్కాటు.. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న తర్వాత.. జీవితాలు ఎలా ముందుకు సాగుతాయి అనే కోణంలో ఈ కథ కొనసాగుతుంది. ఎనిమిదవ కథ అభ్యం తిడి వీండుం.. టెక్నలాజి ఎంత పెరిగినా కానీ తిరిగి.. మనుషులంతా నేచర్ తోనే కనెక్ట్ అవ్వాలని చెప్పే కథ ఇది. ఇక ఆఖరి కథ.. స్వర్గం తురక్కున్న సమయం.. ఆఖరి దశలో పిల్లలు తమ వద్ద లేరని బాధపడే ఎంతో మంది తల్లి తండ్రుల భాధను ఈ కథ ద్వారా పరిచయం చేశారు. ఇలా తొమ్మిది కథలు కూడా ఎంతో ప్రత్యేకంగా.. మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చేశాయి. కాబట్టి ఈ ఆంథాలజీ వెబ్ సిరీస్ ను అసలు మిస్ కాకుండా చూసేయండి. ఈ సిరీస్ ప్రస్తుతం జీ5 ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ సిరీస్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.