iDreamPost
android-app
ios-app

ప్రాణం కోసం ఆరాటం.. చావుతో పోరాటం.. OTTలో ఈ సిరీస్ కి మెంటలొచ్చేస్తది!

OTT Suggestions- Best Survival Action Drama: జాంబీ సినిమాలు మీకు ఇష్టమైతే.. ఈ సిరీస్ మీకు అంతకు మించిన థ్రిల్ ని ఇస్తుంది. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ జాంబీ సినిమాల కంటే పది రెట్లు ఎక్కువ ఫీల్ ఇస్తుంది.

OTT Suggestions- Best Survival Action Drama: జాంబీ సినిమాలు మీకు ఇష్టమైతే.. ఈ సిరీస్ మీకు అంతకు మించిన థ్రిల్ ని ఇస్తుంది. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ జాంబీ సినిమాల కంటే పది రెట్లు ఎక్కువ ఫీల్ ఇస్తుంది.

ప్రాణం కోసం ఆరాటం.. చావుతో పోరాటం.. OTTలో ఈ సిరీస్ కి మెంటలొచ్చేస్తది!

హాలీవుడ్ సిరీస్లు అంటే ఇష్టం ఉండని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అందులో ఉండే యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ లెవల్లో ఉంటుంది. అయితే ఈ సిరీస్లో మీకు యాక్షన్ మాత్రమే కాదు.. ఎమోషన్, డ్రామా, సర్వైవింగ్ వంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇందులో మీరు ప్రతి ఎపిసోడ్లో టన్నుల కొద్దీ యాక్షన్, ఎమోషన్ చూడచ్చు. ఈ సిరీస్ మొత్తం సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అనే కాస్సెప్ట్ లో సాగుతూ ఉంటుంది. అంటే ధైర్యం, తెగువ, కాస్త లక్ ఉన్న వాళ్లు మాత్రమే ఇక్కడ బతకగలరు. లేదంటే ఇందులో ఉండే రాక్షసులకు బలై పోవాల్సిందే. అసలు ఆ సిరీస్ ఏది? ఆ రాక్షసులు ఎవరు? ఎందులో స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

మీకు జాంబీ జానర్లో సినిమాలు ఇష్టమైతే మాత్రం ఇది మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. ఎందుకంటే జాంబీ సినిమాలు ఈ మూవీ ముందు జుజుబి అనాల్సిందే. మొత్తం సిరీస్ అంతా ప్రాణం కోసం పోరాటం.. రాక్షసులపై యుద్ధం చేయడమే ఉంటుంది. ప్రపంచం మొత్తం నాశనం అయిపోతే మిగిలిన ఆ కొంతమంది మాత్రమే తమ ప్రాణాల కోసం పోరాడుతూ ఉంటారు. ఈ వెబ్ సిరీస్ చూస్తే.. మీకు హాలీవుడ్ లో వచ్చిన అయామ్ లెజెండ్ సినిమా గుర్తొస్తుంది. అందులో మాదిరిగానే ఈ సిరీస్ లో కూడా ఒక వైరస్ అటాక్ అవుతుంది. ఆ వైరస్ కారణంగా మనుషులు అంతా వివిధ రాక్షసులుగా మారిపోతూ ఉంటారు. వాళ్లు కనిపించిన అందరినీ చంపుకుంటూ వెళ్తుంటారు.

అయితే జాంబీ సినిమాల్లో మీకు మనుషులుగానే కనిపిస్తారు. కానీ, ఈ సిరీస్లో మాత్రం అంతకు మించి వింత జంతువులు, రాక్షసులుగా మారిపోతారు. వారిని ఎదుర్కోవడం కూడా కష్టమే. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లో చూపించే జెయింట్ మాన్ స్టర్స్ కూడా ఈ సిరీస్లో ఉంటాయి. ప్రాణాల కోసం వాళ్లు చేసే పోరాటం మిమ్మల్ని మెప్పిస్తుంది. అయితే వైరస్ సోకిన కొందరు మంచి వారిని రక్షించేందుకు పోరాడుతూ ఉంటారు. ఇందులో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా మీకు బాగా గుర్తుండిపోతాయి. ప్రస్తుతానికి ఈ సిరీస్ కి సంబంధించి 2 సీజన్స్ వచ్చాయి. 2020లో స్టార్ట్ అయిన ఈ సిరీస్ కి ఆఖరిగా మూడో సీజన్ 2024లో విడుదల కాబోతోంది. ప్రస్తుతానికి రెండు సీజన్స్ అందుబాటులో ఉన్నాయి. మొదటి సీజన్లో 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. రెండో సీజన్ లో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సిరీస్ పేరు స్వీట్ హోమ్. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి