iDreamPost
android-app
ios-app

OTT Movie: పేదింటి పిల్ల ప్రేమలో బిలియనీర్ కుర్రాడు! ఇది ఫ్యామిలీ స్టార్ కి రివర్స్ మూవీ!

OTT Suggestions- Best Love Story: మీరు ఇప్పటివరకు తెలుగులో చాలానే లవ్ స్టోరీలు చూసుంటారు. కానీ, తెలుగు రేంజ్ లో హాలీవుడ్ నుంచి ఒక లవ్ స్టోరీ వచ్చింది. ఆ మూవీని మీరు చూశారా? అచ్చం ఫ్యామిలీ స్టార్ కి రివర్స్ లో ఉంటుంది.

OTT Suggestions- Best Love Story: మీరు ఇప్పటివరకు తెలుగులో చాలానే లవ్ స్టోరీలు చూసుంటారు. కానీ, తెలుగు రేంజ్ లో హాలీవుడ్ నుంచి ఒక లవ్ స్టోరీ వచ్చింది. ఆ మూవీని మీరు చూశారా? అచ్చం ఫ్యామిలీ స్టార్ కి రివర్స్ లో ఉంటుంది.

OTT Movie: పేదింటి పిల్ల ప్రేమలో బిలియనీర్ కుర్రాడు! ఇది ఫ్యామిలీ స్టార్ కి రివర్స్ మూవీ!

మీరు చాలా సినిమాలు చూసుంటారు. వాటిలో లవ్ స్టోరీ అంటే ముందుగా తెలుగు సినిమాలే గుర్తొస్తాయి. ఆ తర్వాత బాలీవుడ్ అయినా ఓకే అంటారు. ఈమధ్యకాలంలో అంతా కొరియన్ లవ్ స్టోరీలు అంటే చెవులు కోసేసుకుంటున్నారు. కానీ, ఎప్పుడైనా హాలీవుడ్ లో ఒక మంచి లవ్ స్టోరీ చూశారా? నిజానికి హాలీవుడ్ లో ఒక లవ్ స్టోరీ అంటే మీరు టక్కున టైటానిక్ అంటారు. కానీ, ఒక మంచి లవ్ స్టోరీ హాలీవుడ్ లో తెరకెక్కించిన ఈ ప్రేమకథను మాత్రం చాలామంది లైట్ తీసుకున్నారు. నిజానికి ఇది ఓటీటీలో ఉన్నా కూడా దీని గురించి చాలామందికి తెలియలేదు. ఎందుకంటే హాలీవుడ్ అంటే యాక్షన్ మాత్రమే అనుకుంటారు మన ఆడియన్స్.

మీకు లవ్ స్టోరీలు చూడటం ఇష్టం ఉంటే మాత్రం ఇది మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా అలరిస్తుంది కూడా. ఒక మంచి కథతో, తెలుగులో ఉండే తరహా ట్విస్టులు, పేద- ధనిక అనే బేధాలతో తెరకెక్కించిన ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది. ఇందులో కథే అసలు ఆకట్టుకునే అంశం. మీరు ఇప్పటివరకు ఒక పేదింటి అమ్మాయి.. గొప్పింటి అబ్బాయిని ప్రేమించడం వారి ప్రేమకు పెద్దలు అడ్డు రావడం వంటి కథలు చూసే ఉంటారు. అలాంటి ఒక బేస్ లైన్ తోనే ఈ కథ ఉంటుంది. అంతేకాకుండా ఒక స్ట్రాంగ్ పాయింట్, పర్పస్, కాన్ ఫ్లిక్ట్ కూడా ఈ చిత్రంలో మీకు ఉంటాయి. అందుకే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయ్యింది ఇది.

Family Star

ఈ సినిమాలో ఇరుగు పొరుగుగా ఒక పేదింటి అమ్మాయి.. ఒక బిలియనీర్ కుమారుడు ఉంటారు. వీళ్లకు ఒక రోడ్డు మాత్రమే అడ్డుగా ఉంటుంది. కిటికీ ఇవతలి నుంచి ఆ అబ్బాయిని గమనిస్తూ ఉంటుంది. అలాగే ఆ విడో నుంచి ఈ పేదింటి అమ్మాయిని ఆ హీరో గమనిస్తూ ఉంటాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం, ప్రేమ ఉన్నాయి. కానీ, వాటిని వ్యక్త పరచడంలో వెనకాడుతూ ఉంటారు. అలాగే మనసులో మాటను బయట పెట్టకుండా.. వైఫై వంకతో ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడే వారి మధ్య ఉన్న బంధం ఏంటో వారికి తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్లు తమ ప్రేమను వెల్లిబుచ్చుకుంటారు.

అయితే ఎప్పుడైతే ఈ కుర్రాడు ఆ అమ్మాయిని తమ కుటుంబానికి పరిచయం చేయాలి అనుకుంటాడో అక్కడే అసలు కథ మొదలు అవుతుంది. అక్కడి నుంచి ఇద్దరి జీవితాలు ఎన్ని మలుపులు తిరగాయి? అబ్బాయి కుటుంబం ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తారా? అసలు వారి ప్రేమను వాళ్లు లెక్క చేస్తారా? అనే పాయింట్స్, సీన్స్ మెప్పిస్తాయి. ఆ తర్వాత యువతి వారి ప్రేమకథ మీద ఒక పుస్తకం కూడా రాస్తుంది. చివరకు వాళ్లు కలిసారా? భగ్న ప్రేమికుల్లా మిగిలిపోయారా అనేదే అసలు పాయింట్. ఈ సినిమా పేరు ‘త్రూ మై విండో’. ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్, హిందీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు మీరు ఈ సినిమాని చూడకపోతే మాత్రం కచ్చితంగా ఒకసారి ట్రై చేయచ్చు. అలాగే ఈ మూవీలో కాస్త బో*ల్డ్ సీన్స్ ఉంటాయి. కాబట్టి ఒంటరిగా చూస్తే కాస్త బెటర్ గా ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి