OTT Suggestions- Best Horror Movie Siccin 2: OTTలో ఈ మూవీ చూడాలంటే గుండెధైర్యం ఉండాలి.. పిల్లలతో చూడొద్దు!

OTTలో ఈ మూవీ చూడాలంటే గుండెధైర్యం ఉండాలి.. పిల్లలతో చూడొద్దు!

OTT Suggestions- Best Horror Movie Siccin 2: ఓటీటీలో మీరు చాలానే హారర్ చిత్రాలు చూసుంటారు. అవే చాలా భయంకరంగా ఉన్నాయి అనుకుని ఉంటారు. కానీ, ఈ మూవీ చూశాక మీ అభిప్రాయం మారిపోవచ్చు. ఈ చిత్రాన్ని ఒంటరిగా మాత్రం అస్సలు చూడకండి. అలాగే పిల్లలతో కలిసి కూడా ఈ సినిమా చూడొద్దు.

OTT Suggestions- Best Horror Movie Siccin 2: ఓటీటీలో మీరు చాలానే హారర్ చిత్రాలు చూసుంటారు. అవే చాలా భయంకరంగా ఉన్నాయి అనుకుని ఉంటారు. కానీ, ఈ మూవీ చూశాక మీ అభిప్రాయం మారిపోవచ్చు. ఈ చిత్రాన్ని ఒంటరిగా మాత్రం అస్సలు చూడకండి. అలాగే పిల్లలతో కలిసి కూడా ఈ సినిమా చూడొద్దు.

చాలా మంది తమకు హారర్ చిత్రాలు అంటే ఇష్టం అని చెప్తూ ఉంటారు. కానీ, అసలు సిసలైన హారర్ మూవీ కనిపిస్తే మాత్రం ఓపెన్ చేయడానికి కూడా ధైర్యం చేయరు. ఒకవేళ ధైర్యంగా ఓపెన్ చేసినా దానిని చూడటం మాత్రం చాలా కష్టం అనే చెప్పాలి. అలాంటి కోవకు చెందిన ఒక హారర్ చిత్రాన్ని మీకోసం తీసుకొచ్చాం. నిజంగా గుండె ధైర్యం ఉంటేనే ఈ మూవీని ఓపెన్ చేయండి. లేదంటే ఈ సినిమా జోలికి వెళ్లకుండా ఉంటేనే చాలా బెటర్. ఈ మూవీలో అలాంటి ఇలాంటి విజువల్స్ కాదు.. చూడగానే ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు ఉంటాయి. ఒక్కోసారి సినిమా చూడలేము అని కూడా అనిపిస్తుంది.

సాధారణంగా హారర్ చిత్రాలు అంటే ఒక్కోసారి భయపెడుతూ.. ఒక్కోసారి కాస్త రిలాక్స్ అయ్యేలా ఉంటాయి. కానీ, ఈ సినిమాలో మాత్రం అలాంటి గ్యాపులు, రిలాక్స్ అవ్వడాలు ఏమీ ఉండవు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు వణుకుతూనే ఉంటారు. ఇందులో ముఖ్యంగా మంత్రాలు, ఆత్మలు, తంత్రాలు మాత్రమే కాకుండా.. బలి*దానాలు వంటి కాన్సెప్ట్ కూడా ఉంది. ఈ సినిమా ఒక ప్రాంతం, ఒక గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అసలు ఆ గ్రామంలో ఏం జరిగింది? అక్కడ ఒక కుటుంబాన్ని ఎంత దారుణంగా బలి*చ్చారు. అనే విషయాలు మొదట మనకు తెలియదు. కానీ, ఆ తర్వాతే అసలు కథ ప్రారంభం అవుతుంది.

ఒక ఇంట్లో చిన్న బాబు మీద బీరువా పడి చనిపోతాడు. ఆ తర్వాత ఆ మహిళ జీవితం అస్తవ్యస్తం అవుతుంది. తన భార్య నిర్లక్ష్యం వల్లే ఆ బాబు చనిపోయాడు అని భర్త కూడా ఆమెను దోషిగా చూస్తాడు. అయితే అది ప్రమాదం కాదు.. బలి*దానం. ఆమెకు తెలియకుండానే తన బిడ్డను అలా చేశారు. ఆ తర్వాత అక్కడ ఎప్పటి నుంచో ఉన్న కొన్ని ఆత్మలు లేస్తాయి. అక్కడి పరిస్థితులు మొత్తం మారిపోతాయి. ఆ మహిళ అసలు కథ తెలుసుకోవాలి అనుకుంటుంది. ఒక కుటుంబానికి జరిగిన ఘోరం గురించి తెలుస్తుంది. అక్కడికే వెళ్లి ఆ ఇంటిని చూడాలి అనుకుంటుంది. అయితే అది ఎంత పెద్ద పొరపాటో ఆమెకు తర్వాత తెలుస్తుంది. ఆ ఇల్లు మొత్తం పిశాచాలే ఉంటాయి.

ఆ ఇంట్లో దృశ్యాలు చూసి ఆ మహిళకు చావే చాలా సుఖం అనిపిస్తుంది. అక్కడి నుంచి అసలు కష్టాలు అంటే ఏంటో ఆమెకు అర్థమవుతుంది. ఈ సినిమా పేరు ‘సిజిన్ 2’. ఇది అన్ని దేశాల్లో అందుబాటులో లేదు. నిజానికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. కానీ, ఇండియాలో ఈ మూవీ అందుబాటులో లేదు. యాపిల్ టీవీ ప్లస్ లో మీరు ఈ చిత్రాన్ని రెంటుకు తీసుకుని చూడచ్చు. ఇవ్వన్నీ కాదంటే.. యూట్యూబ్ లో Siccin 2 మూవీ హిందీ డబ్బింగ్ వర్షన్ ఫ్రీగానే అందుబాటులో ఉంది చూసేయచ్చు. మీకు ఈ మూవీలో చాలా డైలాగులు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఈ మూవీ అరబిక్ లో ఉంటుంది. కానీ.. కథ, సీన్స్, టేకింగ్ మీకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తాయి. కానీ, రెండు కాళ్లు వణుకుతాయి కూడా. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments