OTT Suggestions- Best Family Drama Sharmaji Ki Beti: OTTలో ప్రతి తల్లి- ప్రతి హౌస్ వైఫ్- ప్రతి అమ్మాయి చూడాల్సిన మూవీ!

OTTలో ప్రతి తల్లి- ప్రతి హౌస్ వైఫ్- ప్రతి అమ్మాయి చూడాల్సిన మూవీ!

OTT Suggestions- Best Family Drama Sharmaji Ki Beti: ఓటీటీలో కొన్ని సినిమాలు చూస్తే మనం వావ్ అంటాం. కానీ, కొన్ని సినిమాలు మాత్రం మనల్ని ఆలోచింపజేస్తాయి. ఈ మూవీ కూడా అలాంటిదే.

OTT Suggestions- Best Family Drama Sharmaji Ki Beti: ఓటీటీలో కొన్ని సినిమాలు చూస్తే మనం వావ్ అంటాం. కానీ, కొన్ని సినిమాలు మాత్రం మనల్ని ఆలోచింపజేస్తాయి. ఈ మూవీ కూడా అలాంటిదే.

ఓటీటీలోకి చాలానే కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. ఆడియన్స్ కూడా వచ్చిన అన్ని సినిమాలను వదలకుండా ఏమీ చూసేయరు. వారి తీరికని బట్టి.. వారి ఆసక్తిని బట్టి మాత్రమే కొన్ని కొన్ని సినిమాలను చూస్తూ ఉంటారు. అలాంటి లిస్టులోకి ఈ మూవీ కచ్చితంగా వస్తుంది. మీరు ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే. అందుకే మీకోసం ఈ చిత్రాన్ని సజీషన్ గా తీసుకొచ్చాం. పైగా ఈ సినిమా ఈమధ్యే ఓటీటీలోకి వచ్చేసింది. మరి.. ఆ మూవీ ఏదీ? అసలు ఎందుకు ఆ మూవీని వదలకుండా చూడాలి? అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే ఈ సినిమాలో ఉండే ప్రత్యేకతల గురించి కూడా మాట్లాడుకుందాం.

కొన్ని సినిమాలు చూస్తే వావ్ అనిపిస్తాయి. మరికొన్ని సినిమాలు చూస్తే మాత్రం ఆలోజింపచేస్తాయి. అలాంటి కోవకు చెందిందే ఈ మూవీ కూడా. ఈ సినిమాని ప్రతి మహిళ, ప్రతి హౌస్ వైఫ్, ప్రతి అమ్మాయి, ప్రతి అమ్మ తప్పక చూడాలి. వారి జీవితాలు ఎలా ఉన్నాయి? వాళ్లు వారి కోసం కాకుండా.. కుటుంబం కోసం పరుగులు పెడుతూ ఏం కోల్పోతున్నారు? అసలు ఇప్పటి పిల్లలు తల్లిదండ్రులను ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఉరుకుల పరుగుల జీవితంలో దాంపత్యం ఎలా ఉంటోంది? అనే అన్ని విషయాలను చాలా స్పష్టంగా, అందంగా, ఆలోచింపజేసే విధంగా చూపించారు. ఇప్పటి అమ్మాయిలకు నచ్చిన కెరీర్ ఎంచుకుంటే వారిని ఎలా డామినేట్ చేస్తున్నారు. అనే విషయాలు కూడా చాలా స్పష్టంగా చూపించారు.

ఇప్పటి పరిస్థితులను తెలియజేసేలా మొత్తం మూడు పాత్రలను చూపించారు. ఒకరు హౌస్ వైఫ్. ఆమె ఎప్పుడూ కుటుంబం కోసం ఆలోజిస్తూ ఉంటుంది. కానీ, భర్త మాత్రం ఆమెను ఎప్పుడూ దూరం పెడుతూనే ఉంటాడు. తనతో కనీసం ఐదు నిమిషాలు కూడా మాట్లాడేందుకు ప్రయత్నించడు. తనతో ఎవరూ సరిగ్గా ఉండరు. ఆఖరికి కూరగాయలు అమ్మే వాడికి కూడా కుశల ప్రశ్నలు వేసే సమయం ఉండదు. ఇంక మరో క్యారెక్టర్ తల్లిని చూపించారు. ఆమె కాలేజ్ లో లెక్చెరర్ గా చేస్తూ ఉంటుంది. తనకు ఒక కుమార్తె ఉంటుంది. అసలు ఆ కూతురుకి తల్లి అంటే కనీస మర్యాద కూడా ఉండదు. తన తల్లే తన జీవితాన్ని నాశనం చేస్తోంది అంటూ భావిస్తూ ఉంటుంది.

ఇంక నాలుగో పాత్రలో ఒక యువతిని చూపిస్తారు. తాను ముంబయి క్రికెట్ టీమ్ లో ఆడుతూ ఉంటుంది. అయితే తన ప్రియుడు మాత్రం ఆమెను క్రికెట్ మానేయాలి అని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. అసలు ఆ క్రికెట్ వల్ల నీకు ఏం ఒరుగుతుంది అంటూ చులకన చేస్తూ ఉంటాడు. ఇలా మూడు పాత్రలు ఇప్పటి పరిస్థితులను ప్రతిబింబింపజేస్తూ ఉంటాయి. ఈ కథలో హృదయానికి హత్తుకునే చాలానే అంశాలను చూపించారు. ఈ సినిమా పేరు ‘శర్మాజీకి బేటీ‘. సినిమా హిందీ అని లైట్ తీసుకోకండి. చాలా మంచి కథతో వచ్చారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా చూడాలి అంటే క్లిక్ చేయండి.

Show comments