OTT Suggestions- Best Drama Aattam Movie: ఉద్యోగం చేసే ప్రతి మహిళ చూడాల్సిన మూవీ.. OTTలో ఎమోషనల్ డ్రామా!

ఉద్యోగం చేసే ప్రతి మహిళ చూడాల్సిన మూవీ.. OTTలో ఎమోషనల్ డ్రామా!

OTT Suggestions- Best Drama Aattam Movie: ఓటీటీలో మీరు ఎన్నో సినిమాలు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక ఎమోషనల్ డ్రామా మాత్రం చూసుండరు. ఉద్యోగం చేసే ప్రతి మహిళా ఈ మూవీని తప్పక చూడాలి. వారికి ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి.

OTT Suggestions- Best Drama Aattam Movie: ఓటీటీలో మీరు ఎన్నో సినిమాలు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక ఎమోషనల్ డ్రామా మాత్రం చూసుండరు. ఉద్యోగం చేసే ప్రతి మహిళా ఈ మూవీని తప్పక చూడాలి. వారికి ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి.

సినిమాలు అన్నీ కూడా దాదాపుగా నిజ జీవితంలో జరిగిన.. జరుగుతున్న కథల ఆధారంగానే తెరకెక్కిస్తూ ఉంటారు. ఈ సమాజంలో స్త్రీలు కూడా ఇప్పుడు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. అటు ఇంటి పనులు చూసుకోవడం.. చకచకా ఆఫీస్ కి వచ్చి అక్కడ పనిని చక్కబెట్టడం చేస్తున్నారు. అయితే పని చేసే మహిళల్లో చాలామందికి పని ప్రదేశాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా వేధింపులు ఉంటాయి అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని చోట్ల ఉంటుంది అని అనలేం.. కానీ, కొన్ని దగ్గర్ల తాము ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అని స్వయంగా చెప్పిన వాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి కథతోనే వచ్చిన ఒక సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అది ఏ మూవీనో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకునే సినిమాని కచ్చితంగా ప్రతి వర్కింగ్ ఉమెన్ తప్పక చూడాల్సిందే. ఎందుకంటే ఇది దాదాపుగా మీకు ఎదురైన సంఘటన కూడా కావచ్చు. ఇలాంటి పరిస్థితి నుంచి మీరు తప్పించుకుని కూడా ఉండచ్చు. అయితే అందరికీ అలాంటి పరిస్థితి వస్తుంది అనడం లేదు. కానీ, ఇలాంటి సినిమాలతో కొందరికి ఎదురైన సమస్యలను అయినా ప్రశ్నించినట్లు అవుతుంది. ఒక డ్రామా కంపెనీ ఉంటుంది. వాళ్లు నాటకాలు వేస్తూ ఉంటారు. ఆ టీమ్ లో ఒక్కతే అమ్మాయి ఆర్టిస్టుగా చేస్తుంటుంది. వాళ్ల కంపెనీ మంచి మంచి స్టేజ్ షోలు చేస్తూ ఉంటుంది. వారి టీమ్ లోకి ఒక యాక్టర్ వచ్చి చేరతాడు. అతను కొన్నిరోజుల తర్వాత ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడతాడు.

ఆమెకు జరిగిన ఆ ఘోరాన్ని వాళ్ల టీమ్ మెంబర్స్ కి చెప్పుకుని ఎంతగానో బాధ పడుతుంది. మొదట అందరూ ఆమెకు సపోర్ట్ చేసి.. ఆ హీరోని నిలదీస్తారు. అతను ఒక్కడే ఒక పక్కన ఉంటాడు. అయితే అతను ఒక డ్రామా చేస్తాడు.. వాళ్లందరికీ ఒక ఆశ చూపిస్తాడు. అతను చెప్పిన మాటలకు ఒక్కొక్కరిగా ఆమెను కాదని.. ఆ హీరోకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. చివరకు ఆ అమ్మాయిదే తప్పు అన్నట్లుగా ఎత్తి చూపుతారు. ఆమె అవమాన భారంతో కుంగిపోకుండా.. ఎదిరించి పోరాడుతుంది. అసలు అతను ఏం చేశాడు? ఆమె ఏం అన్యాయం జరిగింది. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనే విషయాన్ని మరో డ్రామా కంపెనీతో కలిసి ఒక నాటకంగా చేసి చూపిస్తుంది. కేవలం ఆ హీరోనే కాదు.. మిగిలిన వాళ్లు కూడా తనపై అఘాయిత్యం చేసిన వారితోనే సమానం అంటూ చెప్పుకొచ్చింది. అయితే అసలు ఆ హీరో వారికి ఏం ఆశ చూపించాడు? వాళ్లు ఎందుకు ప్లేట్ ఫిరాయించారు? ఇలాంటి చాలానే ఇంట్రెస్టింగ్ డ్రామా నడుస్తూ ఉంటుంది. ఈ మూవీ పేరు ‘ఆట్టం‘. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments