iDreamPost
android-app
ios-app

ప్రాణాల కోసం పిల్లల పోరాటం.. OTTలో ఈ సిరీస్ కి కన్నీళ్లు వచ్చేస్తాయి..!

OTT Suggestions- Best Action Thriller Series: ఓటీటీలో మీకు వెబ్ సిరీస్లు చూసే అలవాటు ఉంటే.. ఇది మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇలాంటి సిరీస్ ని చాలా రోజులుగా మిస్ అయ్యామే అనే భావన కూడా కలుగుతుంది.

OTT Suggestions- Best Action Thriller Series: ఓటీటీలో మీకు వెబ్ సిరీస్లు చూసే అలవాటు ఉంటే.. ఇది మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇలాంటి సిరీస్ ని చాలా రోజులుగా మిస్ అయ్యామే అనే భావన కూడా కలుగుతుంది.

ప్రాణాల కోసం పిల్లల పోరాటం.. OTTలో ఈ సిరీస్ కి కన్నీళ్లు వచ్చేస్తాయి..!

ఓటీటీలు వచ్చిన తర్వాత అందరికీ వెబ్ సిరీస్లు కూడా చూడటం అలవాటుగా మారిపోయింది. చాలా మంది ఎక్కువగా వెబ్ సిరీస్లు చూస్తున్నారు. ఎందుకంటే ఒకసారి సిరీస్ స్టార్ట్ చేస్తే కనీసం మూడ్రోజులు చూడచ్చు. అలాంటప్పుడు రోజుకో సినిమా కోసం వెతుక్కునే బాధ్ తప్పుతుంది. పైగా వెబ్ సిరీస్ అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. కాకపోతే కాస్త ల్యాగ్ ఉంటుంది. అది ఓకే అనుకుంటే మీకు కచ్చితంగా నచ్చే ఒక వెబ్ సిరీస్ తీసుకొచ్చాం. అయితే దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న సిరీస్ ఇది. ఇప్పుడు ఆఖరి సీజన్ ఓటీటీలోకి వచ్చేసింది. అందుకే ప్రత్యేకంగా ఈ సిరీస్ గురించి చెప్పుకుంటున్నాం.

సాధారణంగా ఏ సినిమా అయినా.. సిరీస్ అయినా మనకు బాగా నచ్చాలి అంటే అందులో ఉండే పాయింట్ మనకు బాగా నచ్చాలి. అది కాస్త ఎమోషనల్ గా ఉంటే ఇంకా బాగా అట్రాక్ట్ అవుతాం. అదే కాన్ ఫ్లిక్ట్ కాస్త స్ట్రాంగ్ గా ఉంటే మరింత ఎంగేజ్ అవుతాం. అలాగే ఈ సిరీస్లో అలాంటి పాయింట్స్ చాలానే ఉంటాయి. ముఖ్యంగా వారి ప్రాణాల కోసం పిల్లలు చేసే పోరాటం అందరినీ మెప్పిస్తుంది. అంతేకాకుండా.. ఈ సిరీస్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఆ పిల్లల పోరాటం చూసిన తర్వాత కచ్చితంగా కన్నీళ్లు వచ్చేస్తాయి. కొందరు చేసిన తప్పులు ఇంకొందరికి శాపాలు అవుతాయి అంటారు. అలాగే ఈ సిరీస్లో కూడా వారి పరిస్థితి అలా మారిపోతుంది.

ఈ సిరీస్ మొత్తం మనుషులు, హైబ్రిడ్స్ కి మధ్య జరిగే యుద్ధం ఆధారంగా జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలవబోతున్నారు అనేదే అసలు ప్రశ్న. అంటే మనుషులు కాకుండా.. అక్కడ హైబ్రిడ్స్(సగం జంతువు- సగం మనిషి) ఉంటారు. అయితే హైబ్రిడ్స్ ని వెతికి మరీ వేటాడే కొందరు వ్యక్తులు ఉంటారు. అసలు హైబ్రిడ్స్ అనేవే ఉండకూడదు అనేది వారి ప్రయత్నం. అలాంటి సమయంలో ఆ మనుషుల నుంచి వారి ప్రాణాలను కాపాడుకుంటూ అలస్కా చేరుకోవాలి అనేది హైబ్రిడ్స్ లక్ష్యం.

ఈ ఆఖరి ప్రయాణంలో చాలానే చిక్కులు, చిక్కు ముడులు, మలుపులు, ట్విస్టులు, ముఖ్యంగా రక్తపాతం ఉంటుంది. ఈ సిరీస్ కి ఇదే ఆఖరి సీజన్. అయితే గత సీజన్ కంటే కూడా ఇది ఇంకా వైలెంట్ గా ఉంటుంది అని మేకర్స్ హెచ్చరించారు. ఈ సిరీస్ పేరు మరేంటో కాదు.. స్వీట్ టూత్. ఈ స్వీట్ టూత్ సీజన్ 3 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది యాక్షన్, ఎమోషన్, ఫాంటసీ మిళితంగా ఉండే ఒక మంచి యాక్షన్ సిరీస్. మరి.. ఈ స్వీట్ టూత్ సిరీస్ ను చూడాలి అనుకుంటే మాత్రం మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి