iDreamPost
android-app
ios-app

OTTలో సూపర్ మూవీ.. ఈ డ్రైవర్ దెబ్బకు స్పీడ్ బ్రేకర్స్ కూడా షేకవుతాయి!

OTT Suggestions Best Action Crime Thriller: మీరు హాలీవుడ్ చిత్రాలను బాగా ఇష్టపడుతూ ఉంటారా? అయితే ఈ మూవీ మీకోసమే. మీరు సినిమాని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడా కూడా బోర్ లేకుండా కథ పరుగులు పెడుతూ ఉంటుంది.

OTT Suggestions Best Action Crime Thriller: మీరు హాలీవుడ్ చిత్రాలను బాగా ఇష్టపడుతూ ఉంటారా? అయితే ఈ మూవీ మీకోసమే. మీరు సినిమాని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడా కూడా బోర్ లేకుండా కథ పరుగులు పెడుతూ ఉంటుంది.

OTTలో సూపర్ మూవీ.. ఈ డ్రైవర్ దెబ్బకు స్పీడ్ బ్రేకర్స్ కూడా షేకవుతాయి!

మీకు కూడా హాలీవుడ్ యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? వాటి కోసం తెగ వెతికేస్తూ ఉంటారా? అయితే మీకోసం ఒక బెస్ట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఒకటి తీసుకొచ్చాం. ఇది చూడటానికి కాస్త మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్ తరహాలోనే ఉంటుంది. కాకపోతే కాస్త తేడాలు ఉంటాయి. కానీ, యాక్షన్ సీక్వెన్స్ లు, మాస్టర్ ప్లాన్స్ విషయంలో మాత్రం మీకు కచ్చితంగా ఆ మనీ హెయిస్ట్ సిరీస్ గుర్తొస్తుంది. ఇందులో కూడా బ్యాంకు రాబరీలు జరుగుతూ ఉంటాయి. వాటి వెనుక ఒక మాస్టర్ మైండ్ ఉంటుంది. మరి.. ఆ సినిమా ఏది? అంత గొప్పగా ఈ సినిమాలో ఏం ఉంటుంది? అనే విషయాలు చూద్దాం.

యాక్షన్ సినిమాలు అంటే ఎవరైనా టక్కున హాలీవుడ్ అనేస్తారు. ఆ పేరును ఏమాత్రం తీసేయకుండా ఉంటుంది ఈ మూవీ. మీకు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక స్పోర్ట్స్ కారు తరహాలోనే పరిగెడుతూ ఉంటుంది. ఎక్కడా స్పీడ్ బ్రేకర్లు ఉండవు. అయితే ఇందులో మీకు హీరో ఒక కుర్రాడు. చూడటానికి పాల బుగ్గలతో ఎంతో అమాయకంగా కనిపిస్తూ ఉంటాడు. కానీ, ఫీల్డ్ లోకి దిగితే మాత్రం రేసు గుర్రమే ఎక్కడా ఆగకుండా దూసుకుపోతూ ఉంటాడు. ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ సినిమాలో ఒక మాస్టర్ మైండ్ ఉంటాడు. అతను పక్కా వ్యూహాలతో ఒక ప్లాన్ గీస్తాడు. దానిని కొందరు ఘరానా దొంగలను ఉపయోగించుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంటాడు.

Baby Driver

ఒకసారి పిలిచిన దొంగను మరోసారి పిలవడు. కానీ, ఒక్క డ్రైవర్ మాత్రమే రిపీట్ అవుతూ ఉంటాడు. అంతేకాకుండా దోచుకున్నదాన్ని సమానంగా పంచుకుంటారు. కానీ, పాపం ఆ బేబీ డ్రైవర్ కి వాటా ఇచ్చినట్లే ఇచ్చి.. మొత్తం ఆ ప్లాన్ చేసినవాడే లాగేసుకుంటాడు. కేవలం పదో పరకో ఇచ్చి.. పండగ చేసుకోమంటాడు. కానీ, ఆ డ్రైవర్ ఏం అనుకుండా.. తనకు వచ్చిన దాంతో సరిపెట్టుకుంటూ ఉంటాడు. అలా కొన్ని దొంగతనాలు జరిగిన తర్వాత పోలీసులు వీళ్ల మీద ఫోకస్ పెడతారు. దాదాపుగా దొరికినంత పని అవుతుంది. బేబీ డ్రైవర్ నేను ఇంక చేయను అంటాడు. కానీ, అతను ఆఖరిది అని చెప్పి మొత్తానికి బుక్ చేసే ప్రయత్నం చేస్తాడు.

ఈ డ్రైవర్ కు మాటలు వినిపించవు. ఏదో పాటలు వింటున్నట్లు కవర్ చేస్తూ ఉంటాడు. అసలు ఆఖరి దొంగతనం చేశారా? ఈ కుర్రాడు అసలు దొంగలకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? చివరికి పోలీసులు పట్టుకున్నారా? ఆ కుర్రాడు తనకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకున్నాడా? తన జీవితాన్ని నాశనం చేయాలి అని చూసిన వాడి నుంచి తప్పించుకున్నాడా? అనే ఇంట్రెస్టింగ్ అంశాలు తెలియాలి అంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ పేరు బేబీ డ్రైవర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో కూడా రెంట్ బేసిస్ మీద అందుబాటులో ఉంది. మీరు ఇప్పటికే ఈ బేబీ డ్రైవర్ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి